జిల్లాలో 379 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2021-04-19T04:05:26+05:30 IST

కామారెడ్డి జిల్లాలో ఆదివారం 379 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మొబైల్‌ పరీక్ష కేంద్రాల ద్వారా 1,671 మందికి పరీక్షలు నిర్వహించగా మొత్తం 368 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

జిల్లాలో 379 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 18: కామారెడ్డి జిల్లాలో ఆదివారం 379 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మొబైల్‌ పరీక్ష కేంద్రాల ద్వారా 1,671 మందికి పరీక్షలు నిర్వహించగా మొత్తం 368 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో మరో 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో కామారెడ్డి 55, బాన్సువాడ 51, దోమకొండ 26, మద్నూర్‌ 2, బిచ్కుంద 12, గాంధారి 7, భిక్కనూరు 3, బీబీపేట 7, ఎర్రాపహాడ్‌ 31, రామారెడ్డి 6, మాచారెడ్డి 15, రాజీవ్‌నగర్‌ 3, దేవునిపల్లి 52, మత్తమాల్‌ 3, లింగంపేట 1, ఉత్తూనూర్‌ 42, బీర్కూర్‌ 17, డోంగ్లీ 3, హన్మాజీపేట 13, జుక్కల్‌ 9, పుల్కల్‌ 8, పెద్దకొడప్‌గల్‌ 2 కేసులు నమోదు అయ్యాయి.
జిల్లాలో తొమ్మిది మంది మృతి
జిల్లాలో కరోనాతో ఒకే రోజు 9 మంది మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురు, బీర్కూర్‌లో ఒక్కరు, నస్రుల్లా బాద్‌, పెద్దకొడపగల్‌ ఒక్కరు, గాంధారిలో ఇద్దరు, బిచ్కుందలో ఒకరు మృతి చెందిన ట్లు సమాచారం. కాగా శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే 7 గురు మృతి చెందడం తో చికిత్స పొందుతున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో 80 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-04-19T04:05:26+05:30 IST