జిల్లా స్థాయి స్పందనకు 372 అర్జీలు

ABN , First Publish Date - 2021-10-19T05:57:29+05:30 IST

పలు సమస్యలతో జి ల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి వచ్చిన బాధితులు కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు.

జిల్లా స్థాయి స్పందనకు 372 అర్జీలు
స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జేసీలు


కలెక్టర్‌కు బాధితుల మొర 

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్‌  


అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 18: పలు సమస్యలతో జి ల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి వచ్చిన బాధితులు కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో జరిగిన స్పందన కార్యక్రమానికి 372 అర్జీలు వచ్చాయి. కలెక్టర్‌తోపాటు జేసీలు నిశాంతకుమార్‌, సిరి.. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా, డివిజన, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా కలెక్టర్‌ పలు ఆదేశా లు జారీ చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చే సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖలకు సంబంధించి 30 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఆయా అధికారులు వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి కార్యాలయం నుంచి ఈ ఆఫీస్‌ ద్వారా కార్యకలాపాలు జరపాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు. 


Updated Date - 2021-10-19T05:57:29+05:30 IST