Covid restrictions కరోనా ప్రొటోకాల్ ఉల్లంఘించి గ్రాండ్ పార్టీ... 37 మంది అరెస్ట్!

ABN , First Publish Date - 2021-07-11T16:43:21+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వీకెండ్ పార్టీ...

Covid restrictions కరోనా ప్రొటోకాల్ ఉల్లంఘించి గ్రాండ్ పార్టీ... 37 మంది అరెస్ట్!

కోల్‌కతా: Covid restrictions పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వీకెండ్ పార్టీ నిర్వహిస్తున్న ఒక ఫైవ్ స్టార్ హోటల్‌పై పోలీసులు దాడి చేసి, 37 మందిని అరెస్టు చేశారు. వీరంతా కరోనా నియమాలు ఉల్లంఘించి పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్టీలో పాల్గొన్నవారి నుంచి రెండు వాహనాలు, 38 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్‌లో గల పార్క్ హోటల్‌లో చోటుచేసుకుంది. హోటల్‌లో పార్టీ జరుగుతున్నదని సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి ఒంటిగంట సమయంలో దాడిచేసి, కరోనా నియమాలు పాటించని 37 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2021-07-11T16:43:21+05:30 IST