సింగరేణి కార్మికులకు రూ.368 కోట్ల లాభాల వాటా

ABN , First Publish Date - 2022-09-29T05:43:28+05:30 IST

సింగరేణి కార్మికులకు యాజమాన్యం లాభాల వాటా ప్రకటించింది.

సింగరేణి కార్మికులకు రూ.368 కోట్ల లాభాల వాటా

 అక్టోబరు 1న చెల్లింపు 

గోదావరిఖని, సెప్టెంబరు 28: సింగరేణి కార్మికులకు యాజమాన్యం లాభాల వాటా ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిరక లాభాలు రూ.1,227కోట్లు వచ్చినట్టు యాజ మాన్యం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు సింగరేణి కార్మికులకు నిరక లాభాల్లో 30శాతం లాభాల బోనస్‌ను సీఎండీ శ్రీధర్‌ బుధవారం ప్రకటించారు. సింగరేణిలోని 43వేల మంది కార్మికులు, ఉద్యోగులకు మస్టర్ల దామాషా లో కనిష్టంగా రూ.60వేల నుంచి గరిష్టంగా రూ.1లక్ష వరకు రానున్నాయి. ఈ లాభాల వాటాను అక్టోబరు 1వ తేదిన కార్మికులకు చెల్లించనున్నట్టు సీఎండీ వెల్లడిం చారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి మొత్తం టర్నోవర్‌ రూ.26,607 కోట్లుగా జరిగిన ట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధన కోసం కార్మికులు పునరంకి తమైపనిచేయాలని సీఎండీ కార్మికుల కు పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-09-29T05:43:28+05:30 IST