కరోనా రిపోర్ట్: బెంగాల్‌లో కొత్తగా 368 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-05T02:15:09+05:30 IST

బెంగాల్‌లో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 360కి పైగా కరోనా కేసులు రాష్ట్రంలో...

కరోనా రిపోర్ట్: బెంగాల్‌లో కొత్తగా 368 కరోనా కేసులు

కలకత్తా: బెంగాల్‌లో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 360కి పైగా కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 368 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృత్యువాత పడ్డారు. 188 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 6,876కు చేరింది. 355మంది మరణించారు. ఇప్పటివరకు 2,768 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 3,753 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-06-05T02:15:09+05:30 IST