తొలిరోజు 362 దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-08-04T05:42:59+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 31 ఏఎన్‌ఎం, ఎనిమిది ఫార్మసిస్ట్‌, మూడు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను అవుట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది.

తొలిరోజు 362 దరఖాస్తులు
దరఖాస్తులు అందజేస్తున్న అభ్యర్థులు

78 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి నేటితో ముగియనున్న గడువు

భువనగిరిటౌన్‌, ఆగస్టు 3: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 31 ఏఎన్‌ఎం, ఎనిమిది ఫార్మసిస్ట్‌, మూడు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను అవుట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది. రెండు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించనున్నారు. భువనగిరిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రారంభమైన దరఖాస్తు ల స్వీకరణ మొదటిరోజు మంగళవారం 362 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 163 మంది ఏఎన్‌ఎం పోస్టులకు, 121 మంది ఫార్మసిస్ట్‌ పోస్టులకు, 78 మంది ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారంతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొదటిరోజున దరఖాస్తులను అందజేయడానికి పెద్దసంఖ్యలో అభ్యర్థులు, వారివెంట వచ్చిన సహాయకులతో జిల్లా ఆసుపత్రిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం సందడిగా కనిపించింది. డీఎంహెచ్‌ఓ సాంబశివరావు దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. నెల రోజుల్లోపు భర్తీ పక్రియ పూర్తి చేస్తామని అధికారు తెలిపారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-04T05:42:59+05:30 IST