సీఎం సహాయనిధికి రూ.36కోట్లకు పైగా విరాళం

ABN , First Publish Date - 2020-04-03T14:53:51+05:30 IST

కరోనా వైరస్‌ నిరోధక చర్యలు చేపట్టే నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి పలు సంస్థలు, ప్రముఖుల ద్వారా ..

సీఎం సహాయనిధికి రూ.36కోట్లకు పైగా విరాళం

చెన్నై : కరోనా వైరస్‌ నిరోధక చర్యలు చేపట్టే నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి పలు సంస్థలు, ప్రముఖుల ద్వారా రూ. 36 కోట్లకు పైగా విరాళాలు లభించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు, కరోనా వ్యాప్తి నిరోధక పనులు అమలు చేయడానికి ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందించమంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గతనెల 27న విజ్ఞప్తి చేశారు. ఎడప్పాడి పిలుపునందుకుని ప్రముఖ సంస్థలు, దాతలు నాలుగు రోజుల వ్యవధిలో (మార్చి 31దాకా) రూ.36 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆ ప్రకటన పేర్కొంది. కొన్ని సంస్థలు రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల దాకా విరాళాలు అందించాయి. 


టీవీఎస్‌ మోటార్స్‌ సంస్థ రూ.5 కోట్లు, శక్తి మసాలా సంస్థ రూ.5 కోట్లు, ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థ రూ.2 కోట్లు, సిమ్‌సన్‌ సంస్థ రూ.2 కోట్లు, షణ్ముగా సంస్థ రూ.1.25 కోట్లు, గవర్నర్‌ కార్యాలయం రూ.1కోటి, డీఎంకే ట్రస్టు రూ.1 కోటి, నేషనల్‌ సంస్థ రూ.1 కోటి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ రూ.1 కోటి, రాష్ట్ర కార్మిక పురోభివృద్ధి సంస్థ రూ.1 కోటి, రాష్ట్ర పేపర్‌బోర్డు రూ.1కోటి వంతున విరాళాలు ప్రకటించాయి. ఇదేవిధంగా పంజాబ్‌ అసోసియేషన్‌ రూ.50 లక్షలు, తమిళనాడు పారిశ్రామిక పెట్టుబడుల సంస్థ రూ.50లక్షలు, రాశి చిట్స్‌ సంస్థ రూ.50 లక్షలు, డీఎల్‌ఎఫ్‌ ఫౌండేషన్‌ సంస్థ రూ.50 లక్షలు, జీవీజీ పేపర్‌మిల్స్‌ రూ.40 లక్షలు, పల్లవా టీఈ సంస్థ రూ.30 లక్షలు, శ్రీచరన్‌ సంస్థ రూ.30 లక్షలు, వీఎస్‌ఎం వీవ్స్‌ సంస్థ రూ.30 లక్షలు, సూపర్‌ ఆటో పోర్గ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.25లక్షలు, ది కొంగు సంస్థ రూ 25లక్షలు, చాకోసర్వ్‌ సంస్థ రూ.25లక్షలు, కేకేబీకేహెచ్‌ సంస్థ రూ.25లక్షలు, అగ్ని స్టీల్‌ సంస్థ రూ.25లక్షలు కార్ప్‌ నామక్కల్‌ సంస్థ రూ.25లక్షల మేరకు విరాళాలు ప్రకటించాయి.


కంచి కామకోటి పీఠం, మద్రాసు టాకీస్‌, జీవీజీ గ్రావ్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చిదంబరం ఫయర్‌ వర్క్స్‌ ఫ్యాక్టరీ, జీవీజీ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌వీఏ సింటెక్స్‌, ఎస్వీపీబీఎస్బీ, కేటీవీ హీల్‌, కాగ్‌ కేటీవీ, ఫ్యాబ్‌టెక్‌, తమిళ్‌మాన్‌, రాశి అగ్రికల్చర్‌, కేకేఎస్కే, హైటెక్‌ సంస్థల నిర్వాహకులు, కె. రామసామి, ఆర్‌కే ఉమాదేవి, ఎంకే అళగిరి తలా రూ.10లక్షల చొప్పున విరాళాలు ప్రకటించినట్టు ఆ ప్రకటన వివరించింది.

Updated Date - 2020-04-03T14:53:51+05:30 IST