20 ఏళ్లలో 36 దేశాల్లో పెరిగిన చెట్ల సంఖ్య... భారత్ విషయానికొస్తే...

ABN , First Publish Date - 2022-07-04T17:11:55+05:30 IST

గడచిన 20 ఏళ్లలో ప్రపంచంలోని 36 దేశాల్లో...

20 ఏళ్లలో 36 దేశాల్లో పెరిగిన చెట్ల సంఖ్య... భారత్ విషయానికొస్తే...

గడచిన 20 ఏళ్లలో ప్రపంచంలోని 36 దేశాల్లో చెట్ల సంఖ్య పెరిగిందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అంటే అడవి పరిధి పెరిగింది. ఏళ్ల తరబడి శాటిలైట్ సాయంతో అడవుల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, అమెరికాలోని వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్‌ఐ) సంయుక్తంగా గత 20 ఏళ్లలో అడవులు ఏ మేరకు పెరిగాయి లేదా ఏమేరకు తగ్గాయనే వివరాలను అందించాయి. ప్రపంచంలో నరికివేతకు గురైన అడవులతో పోల్చుకుంటే ఇప్పుడు చెట్ల సంఖ్య పెరిగిందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.


వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం 2000- 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా 13.09 మిలియన్ హెక్టార్ల భూభాగంలో అడవుల విస్తీర్ణం పెరిగింది. ఇది పెరూ లాంటి దేశమంత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 13.09 మిలియన్ హెక్టార్ల భూమిలో అడవులు పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఈ 20 ఏళ్లలో 100 మిలియన్ హెక్టార్ల అడవులు నరికివేతకు గురయ్యాయి. ఈ నివేదిక ప్రకారం, చాలా ఐరోపా దేశాలలో చెట్ల పెంపకం చక్కగా సాగినట్లు తేలింది. వీటిలో పోలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే ఐరోపాలో అడవుల పరిధి పెరిగింది. 2020తో పోలిస్తే 2020 నాటికి ఇక్కడ అడవులు 60 లక్షల హెక్టార్లకు పెరిగాయి. ఆసియా దేశాల ప్రస్తావనకు వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, భారతదేశం, సూడాన్, మొరాకో, అల్జీరియాతో సహా ఆఫ్రికా దేశాలలో అటవీ విస్తీర్ణం పెరిగింది. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వేలో కూడా చెట్ల సంఖ్య పెరిగింది. రష్యా, కెనడా, అమెరికా దేశాలలో ప్రపంచంలోనే 50 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం పెరిగింది. అంటే 69 మిలియన్ హెక్టార్ల మేరకు అడవులు పెరిగాయి. 

Updated Date - 2022-07-04T17:11:55+05:30 IST