వికారాబాద్‌ జిల్లాలో 36 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-18T04:40:58+05:30 IST

జిల్లాలో గురువారం 2,494 మందికి కరోనా పరీక్షలు

వికారాబాద్‌ జిల్లాలో 36 కరోనా కేసులు

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : జిల్లాలో గురువారం 2,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 36 మందికి పాజిటివ్‌ వచ్చింది. నవాబ్‌పేట్‌, రామయ్యగూడ, బషీరాబాద్‌, పూడూరు, పట్లూర్‌, బంట్వారం, చిట్యాల్‌, అంగడి రాయిచూర్‌, నవాల్గ, నాగసమందర్‌, మోమిన్‌పేట్‌, కోట్‌పల్లి, జిన్‌గుర్తి పీహెచ్‌సీల్లో పరీక్షలు నిర్వహించిన వారందరికీ నెగిటివ్‌ వచ్చింది. కాగా, అత్యధికంగా తాండూరు, కులకచర్లలో 5 కేసుల వంతున నమోదయ్యాయి. మిగతా కేంద్రాల్లో అంతలోపు కేసులు నమోదయ్యాయి. కాగా, జిల్లాలో 796మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 

Updated Date - 2021-06-18T04:40:58+05:30 IST