Kuwait: దేశం నుంచి బహిష్కరిస్తున్న ప్రవాసులతో కువైత్‌కు కొత్త చిక్కు.. విమాన టికెట్ల కోసం 3,500 మంది వెయిటింగ్

ABN , First Publish Date - 2022-09-23T15:22:11+05:30 IST

ఇటీవల కాలంలో గల్ఫ్ దేశం కువైత్ వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించడం సాధారణమైపోయింది. అయితే, రోజురోజుకు బహిష్కరణ కేంద్రాల్లో బహిష్కరణలకు గురవుతున్న వలసదారుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో వారికి విమాన టికెట్లు దొరకడం లేదు. ఇలా ప్రస్తుతం దేశంలోని బహిష్కరణ కేంద్రాల్లో..

Kuwait: దేశం నుంచి బహిష్కరిస్తున్న ప్రవాసులతో కువైత్‌కు కొత్త చిక్కు.. విమాన టికెట్ల కోసం 3,500 మంది వెయిటింగ్

కువైత్ సిటీ: ఇటీవల కాలంలో గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించడం సాధారణమైపోయింది. అయితే, రోజురోజుకు బహిష్కరణ కేంద్రాల్లో బహిష్కరణలకు గురవుతున్న వలసదారుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో వారికి విమాన టికెట్లు దొరకడం లేదు. ఇలా ప్రస్తుతం దేశంలోని బహిష్కరణ కేంద్రాల్లో సుమారు 3,500 మంది ప్రవాసులు విమాన టికెట్ల కోసం వెయిటింగ్‌లో ఉన్నట్లు తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) వెల్లడించింది. ఇక ప్రవాస కార్మికుల్లో ఇలా దేశ బహిష్కరణకు గురైన వారిలో చాలా మంది కంపెనీ కాంట్రాక్ట్ ముగిసిన వారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరికి కంపెనీ నుంచి ఎలాంటి విమాన టికెట్లు రావు. ఇప్పుడిదే సమస్యగా మారింది. 


వరుస తనిఖీలు నిర్వహిస్తుండడంతో భారీ సంఖ్యలోనే ఉల్లంఘనదారులు పట్టుబడుతున్నారు. వారిని అరెస్ట్ చేసి బహిష్కరణ కేంద్రాలకు తరలిస్తున్నారు. వీరిలో చాలామంది కంపెనీ కాంట్రాక్ట్ ముగిసిన వారే ఉంటున్నారు. దాంతో వారి స్పాన్సర్ల నుంచి విమాన టికెట్, ఇతర ఖర్చులకు డబ్బులు వసూలు చేయడానికి అధికారులకు అవకాశం లేకుండా పోయింది. అలాగే ప్రస్తుతం బహిష్కరణ కేంద్రాల్లో ఉన్న 3వేలకు పైగా మంది ప్రవాసులకు ఆహారం, నీరు, మెడికల్ ఇతర వాటికి బోలేడు ఖర్చు అవుతోంది. ఇది ప్రభుత్వంపై అదనపు భారం. దాంతో ప్రస్తుతం సొంత ఖర్చులతో స్వదేశానికి వెళ్లే ప్రవాసులను అధికారులు వెంటనే పంపించేస్తున్నారు. మిగతా వారిని బహిష్కరణ కేంద్రాల నుంచి జైలుకు తరలిస్తున్నారు. వారికి విమాన టికెట్లు సెట్ అయ్యాక దేశం నుంచి పంపించాలని నిర్ణయించారు. ఇలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 3,500 మంది విమాన టికెట్ల కోసం వెయిటింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.      


Updated Date - 2022-09-23T15:22:11+05:30 IST