చైనా దిగుమతులపై సుంకాల పెంపు

ABN , First Publish Date - 2020-09-28T08:25:38+05:30 IST

చైనాలో తయారై అమెరికాలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ...

చైనా దిగుమతులపై సుంకాల పెంపు

  • ట్రంప్‌ ప్రభుత్వంపై 3,500 కంపెనీల కేసులు


వాషింగ్టన్‌, సెప్టెంబరు 27: చైనాలో తయారై అమెరికాలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెండు వారాల్లో 3,500 కంపెనీలు యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేశాయి. ఈ కంపెనీలు టెస్లా ఇంక్‌, ఫోర్డ్‌ మోటార్‌ కో, టార్గెట్‌ కార్ప్‌, వాల్‌గ్రీన్‌ కో, హోమ్‌ డిపో వంటివి ఉన్నాయి.  

Updated Date - 2020-09-28T08:25:38+05:30 IST