Abn logo
Sep 27 2021 @ 16:12PM

చనిపోదామనుకున్న 18 ఏళ్ల కుర్రాడు.. పాము కాటేస్తే పని ఈజీగా అయిపోతుందని అనుకున్నాడు.. చివరకు అదే లైఫ్ టర్న్ చేసింది..!

ఇంటర్నెట్ డెస్క్: పేదరికమే అతడి సమస్య.. ఆర్థిక కారణాల వల్ల చదువును మధ్యలోనే వదిలేశాడు. డబ్బులేక.. కనీస అవసరాలు తీరక.. అర్థాంతరంగా జీవితాన్ని ముగిద్దాం అనకున్నాడు. ఎలా అయితే ఈజీగా చనిపోవచ్చిన ఆలోచించాడు. పాముకాటు ద్వారా మరణిస్తే మేలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే అనూహ్యంగా ఏ పాము ద్వారా అయితే ప్రాణాలు తీసుకుందామనుకున్నాడో.. అదే అతని లైఫ్‌ను టర్న్ చేసింది. ఫలితంగా స్థానికంగా గుర్తింపు పొంది.. దర్జాగా జీవిస్తున్నాడు. ఇంతకీ ఏంటీ పాముగోల అనే విషయంలోకి వెళితే..


కమల్ సిసోడియా.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని నహర్దా బల్ది అనే ప్రాంతం ఆయన స్వస్థలం. పేద కుటుంబంలో జన్మించిన కమల్ సిసోడియా.. ఆర్థిక కారణాల 8వ తరగతిని కూడా పూర్తి చేయకుండానే చదువుకు గుడ్‌బై చెప్పాడు. చేతిలో డబ్బులు లేక.. 18వ ఏటనే ప్రాణాలను తీసుకుందామని భావించాడు. పాము కాటు ద్వారా చనిపోదాం అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే జనవాసాల్లోకి పాము వొచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న కమల్ సిసోడియా.. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది తనను కరుస్తుందని దీంతో ప్రాణాలు విడువొచ్చని భావించాడు. ఈ క్రమంలోనే పామును జాగ్రత్తగా తన చేతుల్లో బంధించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అది అతడిని కరవలేదు. దీంతో కమల్‌ సిసోడియాకు పాములంటే భయం పోయింది.


జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకోవడం.. వాటిని అడవుల్లో విడిచిపెట్టడాన్ని హాబీగా మార్చుకున్నాడు. కాగా.. హాబీగా చేసినపనే ప్రస్తుతం అతడికి ఉపాధిగా మారిపోయింది. ప్రస్తుతం అతడికి 35ఏళ్లుకాగా.. దాదాపు 17ఏళ్లుగా పాములను పడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు. కమల్ సిసోడియా గురించి.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ తెలియడంతో.. వారంతా ఇప్పుడు అతడిని సంప్రదిస్తున్నారు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా.. ఎప్పుడు సమాచారం అందినా.. అక్కడకు వెళ్లి, పాములను బంధిస్తున్నాడు. ఈ క్రమంలో సంతోషంతో వారిచ్చే ఎంతో కొంత డబ్బును తీసుకుని.. హ్యాపీగా జీవిస్తున్నాడు. ఈ సందర్భంగా తాజాగా స్పందించిన కమల్ సిసోడియా.. ఇంట్లోకి దూరిన పాములను పట్టుకున్నప్పుడు కొందరు వెయ్యి రూపాయలను కూడా ముట్టచెప్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు సుమారు 8వేల పాములను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఒక్కసారి కూడా పాము కాటుకు గురికాలేదని చెప్పారు. అంతేకాకుండా పాములను పట్టుకోవడానికి అవసరమైన ట్రైనింగ్‌ను ఎక్కడా తీసుకోలేదని స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...