HYD లో 346 మంది మందుబాబులకు జైలు.. 32.30 లక్షల జరిమానాలు

ABN , First Publish Date - 2021-07-27T14:13:32+05:30 IST

వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ..

HYD లో 346 మంది మందుబాబులకు జైలు.. 32.30 లక్షల జరిమానాలు

హైదరబాద్‌ సిటీ : సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ వాయిలేషన్స్‌కు పాల్పడుతున్న వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఐదు రోజుల్లో (ఈ నెల 19 నుంచి 23 వరకు) సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు 928 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 589 మంది మందుబాబులు, 298 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లేని వారు, నలుగురు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు, 37 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 346  మంది మందుబాబులకు, ఏడుగురు డ్రైవింగ్‌ లైసెన్స్‌లేని వాహనదారులకు న్యాయస్థానాలు జైలు శిక్ష విధించాయి. మిగిలిన వారికి జరిమానాలు విధించాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడినిన 298 మందికి, సెల్‌డ్రైవింగ్‌ చేసిన నలుగురికి, 37 మంది మైనర్‌ డ్రైవింగ్‌ చేసిన వారికి న్యాయస్థానాలు జరిమానాలు విధించాయి. జైలు శిక్షపడిన వారిలో 1 నుంచి గరిష్ఠంగా 20 రోజుల పాటు జైలు శిక్ష విధించారు.


32.30 లక్షల జరిమానాలు..

ఇటు మందుబాబులు, విత్‌అవుట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేసుల్లో మొత్తం రూ.32,30,900లు జరిమానాలు వసూలు అయ్యాయు. వసూలైన జరిమానాల్లో మందుబాబుల ద్వారా వసూలైన జరిమానాలు- రూ.20,82,600లు. విత్‌డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేసుల ద్వారా రూ.11,14,200లు. కాగా.. సెల్‌ డ్రైవింగ్‌ కేసుల ద్వారా రూ.11,100 జరిమానాలు, మైనర్‌ డ్రైవింగ్‌ ద్వారా రూ.23000లు వసూలైనట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-27T14:13:32+05:30 IST