జిల్లాలో 345 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-04-23T05:25:25+05:30 IST

జిల్లాలో గురువారం కొత్తగా 345 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 113, మార్కాపురం 36, మార్కాపురం రూరల్‌ 24, పొదిలి 15, కనిగిరి 14,సంతమాగులూరు 12, త్రిపురాంతకం 12, దర్శి 11, యర్రగొండపాలెం 11, శింగరాయకొండలో 10 కరోనా కేసులు వచ్చాయి.

జిల్లాలో 345 పాజిటివ్‌ కేసులు
చిన్నారికి సంజీవని బస్సు నుంచి కొవిడ్‌ పరీక్ష చేస్తున్న సిబ్బంది


ఒంగోలు (కార్పొరేషన్‌) ఏప్రిల్‌ 22 : జిల్లాలో గురువారం కొత్తగా 345 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 113, మార్కాపురం 36, మార్కాపురం రూరల్‌ 24, పొదిలి 15, కనిగిరి 14,సంతమాగులూరు 12, త్రిపురాంతకం 12, దర్శి 11, యర్రగొండపాలెం 11, శింగరాయకొండలో 10 కరోనా కేసులు వచ్చాయి. అలాగే ఒంగోలు రూరల్‌, రాచర్ల, ఎస్‌ఎన్‌పాడు, ఉలవపాడు, అద్దంకి, బేస్తవారపేట, ఎన్‌జీపాడు, దోర్నాల, కంభం, పర్చూరు, గిద్దలూరు, మర్రిపూడి, మార్టూరు, ముండ్లమూరు, పెదారవీడు, వెలిగండ్ల తదితర ప్రాంతాల్లో కూడా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


12 మంది టెన్త్‌ విద్యార్థులకు కరోనా 

  జిల్లాలోని వివిధ ఉన్నతపాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న 12మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా విజృంభణ నేపఽథ్యంలో 1నుంచి 9వ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. టెన్త్‌ చదువుతున్న విద్యార్థులకు మాత్రం పాఠశాలల్లో రెగ్యులర్‌ తరగతులతోపాటు ప్రత్యేక స్టడీ అవర్లు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 4.30వరకు విద్యార్థులు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తుంది. కరోనా 2వేవ్‌ ఉధృతంగా ఉండటంతో ఉపాధ్యాయులు సైతం పాఠశాలలకు వెళ్ళాలంటే  వణికిపోతున్నారు. జిల్లాలో గురువారం ఒక్కరోజే 12మంది విద్యార్థులు కరోనా బారిన పడటమే అందుకు నిదర్శనం. పర్చూరు మండలం చెరుకూరు హైస్కూలులో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. ఈ ఆరుగురు బాలికలు. ఇంకొల్లు మండలం దుద్దుకూరు హైస్కూలులో ముగ్గురు బాలికలకు పాజిటివ్‌ నిర్ధారణైంది. జె.పంగులూరు మండలం బూదవాడ హైస్కూలులో ఇద్దరు, కొమరోలు మండలం రాజుపాలెం హైస్కూలులో ఒకరికి కరోనా సోకింది. ప్రాఽథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు కూడా పాజిటివ్‌ నిర్ధారణైంది. తాళ్ళూరు మండలం కొత్తపాలెం ఎంపీసీ స్కూలు, ఉలవపాడు మండలం భీమవరం ఎంపీపీ స్కూలు (ఏఏపీ) పనిచేస్తున్న ఒక ఎస్జీటీ కరోనా బారినపడ్డారు. 

పదోతరగతి విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు రద్దు 

పదోతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం తర్వాత, సెలవు దినాల్లో నిర్వహించే ప్రత్యేక తరగతులను రద్దు చేస్తూ డీఈఓ విఎ్‌ససుబ్బారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అన్ని పని దినాల్లో పదోతరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30వరకు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాలని హైస్కూల్‌ హెచ్‌ఎంలను ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించవదని డీఈఓ తెలిపారు. 


Updated Date - 2021-04-23T05:25:25+05:30 IST