సీఎం ఇలాకాలో 328 కోట్ల పరిశ్రమ

ABN , First Publish Date - 2021-12-04T07:35:23+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి.

సీఎం ఇలాకాలో 328 కోట్ల పరిశ్రమ

  • గజ్వేల్‌లో ఆజాద్‌ ఎలక్ట్రికల్స్‌కు అనుమతి
  • ఇతర పరిశ్రమల కోసం మరో 2వేల ఎకరాల భూసేకరణ
  • పనికిరాని భూములకూ కోట్లు


గజ్వేల్‌/ములుగు, డిసెంబరు 3: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పటికే ములుగు మండలం కర్కపట్ల, మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో టీఎ్‌సఐఐసీ సెజ్‌లలో భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తా జాగా టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో ములుగు మండ లం తునికిబొల్లారం గ్రామంలో 23.20 ఎకరాల్లో రూ.328 కోట్లతో ఆజాద్‌ ఎలక్ట్రికల్స్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భూమిని సైతం అప్పగించింది. ఈ మేరకు నెల రోజుల క్రి తంటీఎ్‌సఐఐసీతో పరిశ్రమ యాజమాన్యం ఒప్పం దం కుదుర్చుకుంది. ఆరు నెలల్లోపు పరిశ్రమను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లలోగా పూర్తిస్థాయిలో పరిశ్రమ అందుబాటులోకిరానుంది. ఈ పరిశ్రమతో 920 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమతో కొండపోచమ్మసాగర్‌ భూ నిర్వాసితులకు ఉపాధి లభించనుంది. 


భూముల ధరలకు రెక్కలు..

పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ములుగు, గజ్వేల్‌, వర్గల్‌ మండలాల పరిధిలో 2 వేల ఎకరాల భూ మిని ప్రభుత్వం సేకరించి టీఎ్‌సఐఐసీకి అప్పగించింది. కాగా ఇప్పటికే మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. బీడు భూములు సైతం ఎకరా రూ.కోటికి పైగానే పలుకుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటైతే  ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు భూముల విలువలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-04T07:35:23+05:30 IST