కమ్మేస్తోంది

ABN , First Publish Date - 2020-06-07T05:53:42+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కొత్త మండలాలకు విస్తరిస్తోంది. ఏలూరుతో పాటు తాజాగా నర్సాపురం నియోజక వర్గంలోనూ పెద్దఎత్తున పాజిటివ్‌ కేసులు

కమ్మేస్తోంది

ఒకేరోజు 32 కరోనా కేసులు

జిల్లాలో మొత్తం సంఖ్య 239

ఏలూరులోనే అత్యధికంగా 69 కేసులు

కొత్త మండలాలకు విస్తరణ

నరసాపురంలో మరింత దూకుడు

జిల్లాలో ముగ్గురు డిశ్చార్జి

కొత్తగా మూడు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

జిల్లాలో కరోనా వైరస్‌ కొత్త మండలాలకు విస్తరిస్తోంది. ఏలూరుతో పాటు తాజాగా నర్సాపురం నియోజక వర్గంలోనూ పెద్దఎత్తున పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. జిల్లాలో శనివారం ఏకంగా 32 పాజిటివ్‌ కేసులు గుర్తించారు. మరో 17 కేసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏలూరులో నాలుగు,నర్సాపురం రూరల్‌ మండలం ఎల్‌బీచర్లతో పాటు నర్సాపురం టౌన్‌లోనూ 13 కేసులు, చాగల్లులో రెండు, పాలకొల్లులో రెండు, లింగపాలెం, వట్లూరు, తాడేపల్లిగూడెం, ఉండి, పెనుమంట్ర, కొవ్వూరు, ఆచంట, చెరుకువాడ, విస్సాకోడేరు, మొగల్తూరులో ఒక్కో పాజిటివ్‌ కేసు బయటపడ్డాయి.  


ఇంతకుముందు ఏలూరు, పెనుగొండల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కాగా, తాజాగా ఆ స్థానాన్ని నర్సాపురం ఆక్రమించింది. ఒకప్పుడు కేవలం ఒక పాజిటివ్‌ కేసే నరసాపురంలో నమోదై అక్కడితో ఎటువంటి కేసులు నమోదు కాకుండా స్ధిరంగా నిలిచింది. కానీ రెండు రోజు లుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య నర్సాపురం రూరల్‌ మండలం లోని ఎల్‌బీ చర్లలో ఆరంభమైంది. ఇప్పుడా సంఖ్య కాస్త మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. మొగల్తూరు, పెనుమంట్ర, ఆచంట, పాలకోడేరు, చాగల్లు వంటి మండ లాల్లోనూ కొత్తగా పాజిటివ్‌ కేసులు ప్రవేశించాయి.


వీటికి అదనంగా త్వరలోనే మరిన్ని కేసులు నమోదయ్యే అవ కాశాలు లేకపోలేదు. గడిచిన ఐదు రోజుల కాలంలో దాదాపు 70 కేసులు నమోదైనట్లు అయింది. ఇప్పటిదాకా అధికా రికంగా ప్రకటించిన పాజిటివ్‌  కేసుల సంఖ్య జిల్లాలో 222కు చేరింది. దీంట్లో ఏలూరు నగరంలోనే 69గా తేల్చారు. అలాగే పెనుగొండలోని దాదాపు 25కు పైగానే కేసులు నమోదు కాగా, ఇప్పటికీ ఆలింకుతోనే మరిన్ని కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గుర్తించిన పాజిటివ్‌ కేసుల్లో కానిస్టేబుల్‌, వైద్య ఉద్యోగి కూడా ఉన్నారు. వీరుకాక తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలోనూ, ఏలూరు ప్రభుత్వాసు పత్రిలోనూ పాజిటివ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఫలితాలు వెలువడినా ఈ రెండింటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జిల్లాలో మరో ముగ్గు రిని ఐసోలేషన్‌ వార్డు నుంచి తాజాగా డిశ్చార్జి చేశారు.  


కొత్తగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగానే ఎక్కడిక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు దిశగా జిల్లా యంత్రాంగం చురుగ్గా కదిలింది. ఇప్పటిదాకా పాజిటివ్‌ అధికారికంగా గుర్తించిన కేసులన్నింటికి ఆశ్రం ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తున్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అనుమానిత కేసుల న్నింటినీ ఏలూరులో ఏర్పాటు చేయనున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించాలని నిర్ణయించారు. అక్కడే ప్రత్యేక వైద్య విభాగాలను 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతారు. ఏలూరు శివారులోని పోణంగిలో తాజాగా నిర్మించిన టిడ్కో గృహ సముదాయంలో తొలిగా ఆదివారం నుంచి అనుమానితులకు ఆవాసంగా మార్చేందుకు ప్రయత్నాలు ఆరంభమ య్యాయి.


ఇప్పటి దాకా పాజిటివ్‌ నిర్ధారణకు ముందు అనుమానితులుగా గుర్తించి, వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తాడేపల్లిగూడెం క్వారంటైన్‌కు పంపేవారు. ఇప్పుడు మాత్రం కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి పాజిటివ్‌ అధికారిక నిర్ధారణ జరిగేంత వరకూ పోణంగిలోని ఎన్టీఆర్‌ గృహ సముదాయానికి తరలిస్తారు. సుమారు 300 పడకల సామర్ధ్యం కల్గిన ఈ హౌసింగ్‌ సముదాయం ఒక వేళ  రోగులతో నిండిపోతే  హైవే సమీపాన ఉన్న సోషల్‌ వే ల్ఫేర్‌ హాస్టల్‌కు తరలిస్తారు. ఇక్కడ కూడా 300 పడకల ఏర్పాట్లు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులోకి తెస్తున్నారు. ఒక వేళ ఈ రె ండూ కూడా చాలకపోతే సీఆర్‌రెడ్డి మహిళా కళాశాలల్లోకి చేరుస్తారు. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మూడు  ప్రత్యేక వసతులను అందుబాటులోకి తెచ్చినట్లైంది. వీటికి కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా నామకరణం చేశారు. 


అంతటా భయం..భయం

ఏలూరు రూరల్‌/పాలకోడేరు/పెదపాడు/కొవ్వూరు : శనివారం కొత్త ప్రాంతాల్లో వైరస్‌ కనిపించడంతో ఆందోళన నెలకొంది. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ నాగేంద్ర కాలనీలో మరో పాజిటివ్‌ కేసు నమో దైంది. ఇదే కాలనీలో కొద్దిరోజుల క్రితం ఒక మహిళకు కరోనా సోకింది. ఇక్కడే ఒక యువకుడికి పాజిటివ్‌గా తేలింది. ప్రైమరీ కాంటాక్టుగా వైద్యులు నిర్ధారించారు. వీరితో సన్ని హితంగా ఉన్నవారి కోసం జల్లెడపడుతున్నారు. విస్సాకోడేరులో ఒక గర్భిణికి పాజిటివ్‌ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గర్భిణి భర్త, దగ్గర బంధువులు ఆరుగురికి పరీక్షలు నిర్వహించారు. వారితో కాంటాక్టు అయిన 40 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవ్వూరు మండలం వాడపల్లి శివారు బంగారమ్మపేటలో పదమూడేళ్ల బాలికకు కరోనా సోకింది. గ్రామాన్ని ఆర్డీవో డీ.లక్ష్మారెడ్డి, అధికారులు శనివారం సందర్శించారు. బంగారమ్మపేటకు చెందిన కుటుంబం మూడు నెలల కిందట ఒంగోలు బెల్లపుబట్టీ పనులకు వెళ్లింది.


మే 28న గ్రామానికి తిరిగి రాగా వారిని హోంక్వారంటైన్‌ చేసి వైద్య పరీక్షలు నిర్వ హించారు. శనివారం బాలికను ఏలూరు ఆశ్రం ఆసు పత్రికి తరలించారు. పెదపాడు మండలం వట్లూరులో శనివారం రెండు కేసులతో మొత్తం 11 నమో దయ్యాయి. పెదపాడు, తోటగూడెం, తాళ్లగూడెం, వట్లూరు గ్రామాల్లో వైరస్‌ బారినపడిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని సుమారు 150 నుంచి 200 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపి నట్టు సమాచారం. వట్లూరులో వైరస్‌ బారినపడివారు ఇద్దరూ పోలీసు శాఖలో పనిచేసేవారే కావడం గమనార్హం. లింగపాలెం మం డలం ములగలంపాడులో ఒక మహి ళకు వైరస్‌ వచ్చినట్టు గుర్తించారు. అమరావతిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యను ములగలం పాడులోని ఆమె పుట్టింట్లో దించి వెళ్లాడు. విషయాన్ని తెలుసుకున్న గ్రామ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆమెకు కె.గోకవరం పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయించగా పాజిటివ్‌ వచ్చింది. దీనికి సంబంధించి సుమారు 40 మందిని ఏలూరు క్వారంటైన్‌కి తరలించినట్లు తహసీల్దార్‌ రాధిక తెలిపారు.  


ఏలూరు , గూడెంలలో ఉద్యోగులకు..

ఏలూరు క్రైం / ఆచంట  : ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఒక కానిస్టేబుల్‌ అనారోగ్యానికి గురికావడంతో సెలవు పెట్టారు. అయితే అనుమానంతో కరోనా పరీక్ష చేయించడంతో వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. శనివారం ప్రకటించారు. దీంతో ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తాళాలు వేసి ఉంచారు. అత్యవసరమైన కేసులు ఉంటే గేటు బయట నుంచే పరిష్కారానికి చర్యలు తీసు కుంటున్నారు. మరోవైపు స్టేషన్‌లో పనిచేసే వారంతా శని వారం పరీక్షలు చేయించుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలికి పాజిటివ్‌ వచ్చి నట్లుగా సమాచారం. ఆమె ప్రస్తుతం కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే ట్రూనాట్‌ ల్యాబ్‌లో సహాయకురాలిగా పని చేస్తుందని చెప్తున్నారు.


ప్రతివారం ల్యాబ్‌లో పనిచేసే సిబ్బం దికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా చేసిన పరీక్షల్లో వైరస్‌ ఉన్నట్లు  నిర్ధారణ కావడంతో ఆమెను ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. తుది పరీక్ష నిర్వహించాల్సి ఉంది.  ఆచంట మండలం భీమలాపురానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ కావడంతో గ్రామాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.గ్రామానికి చెందిన వ్యక్తి తాడేపల్లిగూడెం మునిసిపల్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తాడు. ఈనెల 23 నుంచి 30 వరకు తాడేపల్లిగూడెం క్వారంటైన్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తించాడు. తరువాత రెండు రోజులు పాటు భీమలాపురంలో జరిగిన అమ్మవార్ల జాత రలో పాల్గొన్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు 31 మందిని తాడేపల్లిగూడెం క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.  


 చాగల్లులో అన్నదమ్ములకు పాజిటివ్‌

చాగల్లు : చాగల్లు ఇందిరమ్మ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరికి కరోనా సోకినట్టు అధికారులు శనివారం ధ్రువీకరించారు. ఉపాధి కోసం ముంబైకి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిపారు. అనారోగ్యంగా ఉండడంతో మేరకు మే 31న క్వారంటైన్‌కు తరలించారు. అతనితో పాటుగా కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అతని తమ్ముడికి కూడా పాజిటివ్‌ ఉన్నట్టు గుర్తించి ఏలూరు ఆసుపత్రికి తరలించారు.  

         

మోడీ గ్రామంలో మరో 13 కేసులు

 నరసాపురం: నరసాపురం మండలం చామకూరిపాలెం పంచాయితీ పరిధిలోని మోడీ గ్రామంలో తాజాగా మరో 13 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదెనట్లు సబ్‌కలెక్టర్‌ విశ్వనాథన్‌ చెప్పారు. గతంలో ఈ గ్రామంలో ఆరు కేసులు రావడంతో 70 మందిని క్వారంటైన్‌కు తరలించామన్నారు. వారిలో ఇప్పటి వరకు వచ్చిన రిపోర్టుల ప్రకారం 13 మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. వీరితో సంబంధం ఉన్న 120 మందిని కూడా క్వారంటైన్‌కు తరలిస్తున్నామన్నారు. 


 అంతర్వేది వెళ్లి వచ్చిన మహిళకు..  

మొగల్తూరు: మొగల్తూరు మండలం రామ న్నపాలెం పంచాయతీ ఆకనవారితోటలో ఒక మహిళకు పాజిటివ్‌ సోకింది. ఈమె పదిహేను రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చినప్పటి నుంచి రొంప, దగ్గుతో బాధపడుతోంది. దీంతో మొగల్తూరులో మందులు తీసు కునేందుకు వెళ్ళ డంతో ఫార్మసీ యాప్‌లో ఈమె పేరు నమోదు చేశారు. యాప్‌ను పరిశీలించిన వైద్యులు పరీక్షలు చేయగా పాజి టివ్‌గా తేలింది. ఈ కేసుతో కాంటాక్టు అయిన 29 మందిని తాడేపల్లిగూడెం క్వారంటైన్‌కు తరలిస్తామని డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌వో దుర్గాప్రసాద్‌, వైద్యులు రామకృష్ణ, దివ్యభారతిలు తెలిపారు.

Updated Date - 2020-06-07T05:53:42+05:30 IST