31 వరకు Night Curfew

ABN , First Publish Date - 2022-01-11T13:49:40+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో రాత్రిపూట కర్ఫ్యూ ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి అధికారులు సోమవారం

31 వరకు Night Curfew

- బస్సుల్లో 75 శాతం ప్రయాణికులకు అనుమతి

- Cm Stalin ఆదేశం 


చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో రాత్రిపూట కర్ఫ్యూ ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి అధికారులు సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎంకు వివరించారు. ఈ సమా వేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ నెల 16వ తేదీ కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. బస్సుల్లో 75 శాతం ప్రయాణికులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా సంక్రాంతి, తైపూసం సందర్భంగా ఆలయాల్లో భక్తులు వేల సంఖ్యలో దైవదర్శనానికి వెళ్లే అవకాశం ఉండటంతో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు భక్తుల సందర్శనపై నిషేధం విధించారు. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ రవాణా బస్సుల్లో 75 శాతం ప్రయాణించేందుకు అనుమతించనున్నట్లు వివరించారు. అంతేగాక ఇటీవల ప్రకటించిన నిబంధనలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధా కృష్ణన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, డీజీపీ శైలేంద్రబాబు, నగరపాల నీటి పంపిణీల శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌బేదీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-11T13:49:40+05:30 IST