31న కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్ష

ABN , First Publish Date - 2021-10-28T05:22:59+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం ఈనెల 31 నుంచి కాంగ్రెస్‌ పార్లమెంటరీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.

31న కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న ఒబేదుల్లా

- హాజరుకానున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌

- డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 27 : కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం ఈనెల 31 నుంచి కాంగ్రెస్‌ పార్లమెంటరీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రౌన్‌ గార్డెన్‌ లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని ముఖ్యఅతి ఽథిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ హాజరవుతారని చెప్పారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రె స్‌ నేతలు, ముఖ్యనేతలు అంతా హాజరుకావాలని సూచించారు. మండలంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పూర్తి సమాచారంతో మండల పార్టీ అధ్యక్షులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. వచ్చేనెల 1 నుంచి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అ వుతుందన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చంద్‌రెడ్డిని సలహాదారుడిగా నియమిం చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్తూర్‌ చంద్రకుమార్‌ గౌడ్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, సీజె బెనహర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, జహీర్‌ అక్తర్‌, రాములుయ ూదవ్‌ పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ను పటిష్టం చేయాలి


జిల్లాలో కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ను పటిష్టం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఒబే దుల్లా కొత్వాల్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఓబీసీసెల్‌ పట్టణ అధ్యక్షుడు బండి మల్లేష్‌ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులకు బుధవారం కొత్వాల్‌ నియామకప త్రాలు అందజేశారు. ఓబీసీ సెల్‌ పట్టణ ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచారి, అంజి, మల్లేష్‌, ప్రధాన కార్యదర్శులుగా ప్రకాశ్‌, రవి, రాజు, బాలకృష్ణ, కార్య దర్శులుగా రమేశ్‌, వినయ్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, శేఖర్‌గౌడ్‌, కార్యనిర్వాహక కార్యదర్శు లుగా వెంకటేశ్‌, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, నరేశ్‌లను నియమించారు. 

Updated Date - 2021-10-28T05:22:59+05:30 IST