‘నిసర్గ’ ఎఫెక్ట్ : 31 విమానాలను రద్దు చేసిన అధికారులు... రైళ్లు రీషెడ్యూల్

ABN , First Publish Date - 2020-06-03T19:57:11+05:30 IST

నిసర్గ తుఫాన్ తీరం దాటడంతో ఇటు విమానయాన సంస్థలు, అటు రైళ్ల శాఖ అప్రమత్తమైంది. ఈ తుఫాను కారణంగా షెడ్యూల్ అయిన 50 విమానాల్లో 31

‘నిసర్గ’ ఎఫెక్ట్ : 31 విమానాలను రద్దు చేసిన అధికారులు... రైళ్లు రీషెడ్యూల్

న్యూఢిల్లీ : నిసర్గ తుఫాన్ తీరం దాటడంతో ఇటు విమానయాన సంస్థలు, అటు రైళ్ల శాఖ అప్రమత్తమైంది. ఈ తుఫాను కారణంగా షెడ్యూల్ అయిన 50 విమానాల్లో 31 విమానాలను రద్దు చేసినట్లు ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ బాధ్యులు ప్రకటించారు. మిగితా వాటిని ఎయిర్ ఏషియా ఇండియా, ఇండిగో, గో ఏయిర్, స్పేస్ జెట్ నడిపే బాధ్యతను చూసుకుంటాయని అధికారులు తెలిపారు.


అయితే జూన్ 3 నాటికి ముంబై చేరేవి, అక్కడి నుంచి బయల్దేరే 17 విమానాలను నిసర్గ కారణంగా తామూ రద్దు చేశామని  ఇండిగో ప్రకటించగా, మరో విమానయాన సంస్థ విస్టా... ముంబై, గోవా వెళ్లే విమానాలు, అక్కడి నుంచి వచ్చే విమానాలు నడపడం కాస్త కష్టసాధ్యమేనని ప్రకటించింది. ఇక, స్పైస్ జెట్ కూడా ఇదే రకమైన ప్రకటనను విడుదల చేసింది. 


ఇక, నిసర్గ తుఫాను ప్రభావం రైళ్లపై కూడా పడింది. ముంబై చేరుకునే, అక్కడి నుంచి బయల్దేరే రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబైకి చేరుకునే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్ చేశామని, వాటిని ఇతర మార్గాలకు మళ్లించినట్లు రైల్వే స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-03T19:57:11+05:30 IST