Abn logo
Sep 26 2021 @ 02:03AM

300సార్లు కాలినడకన తిరుమలకు!

  • సిక్కోలువాసి అరుదైన రికార్డు


శ్రీకాకుళం/తిరుమల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాలినడకన 300సార్లు తిరుమలకు చేరుకుని సిక్కోలు వాసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన మహంతి శ్రీనివాసరావుకు కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లి.. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో మక్కువ. ఇప్పటికే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఆయన స్థానం దక్కించుకున్నారు. 1996 నుంచి కాలినడకన తిరుమలకు వస్తున్న శ్రీనివాసరావు 54 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా తిరుమల కొండెక్కి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడం తన లక్ష్యమని, 300 సార్లు తిరుమలకు కాలినడకన రావాలన్న తన సంకల్పాన్ని పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.