జిల్లాలో 300 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2021-04-10T04:31:53+05:30 IST

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మొబైల్‌ పరీక్ష కేంద్రాల ద్వారా 2,478 మంది కి పరీక్షలు నిర్వహించగా మొత్తం 300 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

జిల్లాలో 300 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 9: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మొబైల్‌ పరీక్ష కేంద్రాల ద్వారా 2,478 మంది కి పరీక్షలు నిర్వహించగా మొత్తం 300 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో కామారెడ్డి 17, బాన్సువాడ 34, ఎల్లారెడ్డి 15, దోమకొండ 6, మద్నూర్‌ 12, పిట్లం 20, బిచ్కుంద 13, అన్నారం 2, భిక్కనూరు 10, ఎర్రాపహాడ్‌ 18, రామారెడ్డి 5, మా చారెడ్డి 2, ఎస్‌ఎస్‌నగర్‌ 3, రాజంపేట 4, దేవునిపల్లి 26, రాజీవ్‌నగర్‌ 31, నాగిరెడ్డిపేట 10, బీర్కూర్‌ 25, డోంగ్లీ 22, హన్మాజీపేట 1, నిజాంసాగర్‌ 7, జుక్కల్‌ 3, పుల్కల్‌ 8, పెద్దకొడప్‌గల్‌ 6 కేసులు నమోదు అయ్యాయి.
బరంగ్‌ఎడ్గిలో వృద్ధుడి మృతి
బీర్కూర్‌: మండలంలోని బరంగ్‌ఎడ్గి గ్రామానికి చెందిన బస్వంత్‌రావు దేశ్‌ముఖ్‌(60) అనే వృద్ధుడు కరోనాతో శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బరంగ్‌ఎడ్గి గ్రామంలో బస్వంత్‌రావు దేశ్‌ముఖ్‌ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు గతవారం రోజుల కిందట మహారాష్ట్రలోని బంధువుల ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరై తిరిగి గ్రామానికి వచ్చారు. వచ్చిన రెండు రోజులకు బస్వంత్‌రావు దేశ్‌ముఖ్‌ అస్వస్థతకు గురి కావడంతో గ్రామంలోని వైద్యుడి వద్ద వైద్యం చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో అనుమానం వచ్చి బస్వంత్‌రావు దేశ్‌ముఖ్‌తో పాటు అతని భార్య, కుమారుడు, కోడలు, మనుమడు ఈ నెల 5వ తేదీన బీర్కూర్‌ పీహెచ్‌సీలో రాపిట్‌ టెస్టు లు చేసుకున్నారు. అందులో అందరికి పాజిటివ్‌గా రావడంతో హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. బస్వంత్‌రావు దేశ్‌ముఖ్‌ పరిస్థితి విషమించడంతో 6వ తేదీన నిజామాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అంది ంచారు. చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
బీర్కూర్‌లో 25..
బీర్కూర్‌: బీర్కూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. సంగెంలో 6, నస్రుల్లాబాద్‌లో 3, నెమ్లిలో 1, బీర్కూర్‌లో 7, మద్నూర్‌ మండలం కుర్లలో 1, కోటగిరి మండలం బస్వాపూర్‌లో 1, తిమ్మాపూర్‌లో 6 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.
దోమకొండలో 6..
దోమకొండ: సీహెచ్‌సీ పరిధిలో ఆరు కరోనా  కేసులు నమోదైనట్లు వైద్యాధికారి సంగీత్‌ కుమార్‌ తెలిపారు. దోమకొండలో ఒకటి, సీతారాంపల్లిలో మూడు, సంగమేశ్వర్‌లో ఒకటి, నిజామాబాద్‌కు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు.
తాడ్వాయిలో 13..
తాడ్వాయి: మండలంలో 13 కరోనా కేసులు నమోదయినట్లు ఎర్రాపహాడ్‌ వైద్యాధికారి రవీందర్‌ రెడ్డి తెలిపారు. దేమెకలాన్‌లో 7, కృష్ణాజీవాడిలో 1, తాడ్వాయిలో 3, ఎర్రాపహాడ్‌లో 2 కేసులు నమోద యినట్లు తెలిపారు.
బాన్సువాడలో 34..
బాన్సువాడ టౌన్‌ : బాన్సువాడ ఏరియా ఆస్పత్రి పరిధిలో శుక్రవారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షలలో 34 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలిపారు. వీరిలో 17 మంది బాన్సువాడ పట్టణానికి చెందిన వారు కాగా, 17 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారని ఆయన తెలిపారు.  
నిజాంసాగర్‌లో 8 ..
నిజాంసాగర్‌: మండలంలో మొత్తం 8 మందికి కరోనా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. బంజాపల్లిలో 1, మల్లూర్‌ 2, మాగి ఫ్యాక్టరీ 3, జవహర్‌ నవోదయ విద్యాలయం 1, మహ్మద్‌నగర్‌ 1 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2021-04-10T04:31:53+05:30 IST