Upskilling Programme: లబ్ధి పొందిన 300 మంది భారత కార్మికులు

ABN , First Publish Date - 2021-08-21T18:41:23+05:30 IST

అజ్మన్‌ ప్రాంతంలోని పలు కంపెనీల్లో పని చేస్తున్న సుమారు 50 మంది భారత కార్మికులు శుక్రవారం రోజు బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్‌ స్కిల్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అజ్మన్‌లోని ఇండియన్ అసోసియేషన్

Upskilling Programme: లబ్ధి పొందిన 300 మంది భారత కార్మికులు

యూఏఈ: అజ్మన్‌ ప్రాంతంలోని పలు కంపెనీల్లో పని చేస్తున్న సుమారు 50 మంది భారత కార్మికులు శుక్రవారం రోజు బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్‌ స్కిల్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అజ్మన్‌లోని ఇండియన్ అసోసియేషన్ సహకారంతో దుబాయిలోని ఇండియన్ కాన్సులేజ్ జనరల్ కార్యాలయం ‘ఆప్‌స్కిల్లింగ్ సెషన్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో క్రోమ్‌వెల్ యూకే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థకు చెందిన బోధనా సిబ్బంది పాల్గొని.. భారత కార్మికులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్ డాక్టర్ అమన్ పూరీ మాట్లాడుతూ.. భారత కార్మికుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చెందిచడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనంతరం కాన్సులేట్ కార్యాలయంలోని లేబర్ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ విభాగ అధిపతి మాట్లాడుతూ.. ఇండియన్ కాన్సులేట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను జనవరిలో ప్రారంభించినట్టు చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటి వరకు యూఏఈలోని 300 మంది భారతీయ కార్మికులు శిక్షణ పొందినట్టు చెప్పారు. 


Updated Date - 2021-08-21T18:41:23+05:30 IST