రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-04-22T05:02:51+05:30 IST

అంబటివలస సమీపంలో రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి.

రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి
మృతి చెందిన గొర్రెలు

బొండపల్లి : అంబటివలస సమీపంలో రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి. రైల్వే పోలీసుల తెలిపిన వివరాలు మేరకు... ఆ గ్రామ సమీపంలో గల పొలంలో ఉన్న గొర్రెల మందపై బుధవారం తెల్లవారు జామున కుక్కులు దాడి చేశాయి. దీంతో భయపడిపోయిన గొర్రెలు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై పరుగులు తీశాయి. ఇదే సమయంలో విజయనగరం వైపు నుంచి వస్తున్న గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన నాసర అప్పలస్వామి, రాజానఅప్పన్నకు చెందిన గొర్రెలతో ఓ రైతు పొలంలో మందకోసం ఉంచారు.  కాగా విషయం తెలుసుకున్న స్థానిక పశువైద్యాధికారి కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ ఘటనపై  బొబ్బిలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.


 

Updated Date - 2021-04-22T05:02:51+05:30 IST