30 పోలీసు యాక్టు అమలు : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-03-02T05:10:45+05:30 IST

ప్రొద్దుటూరు పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఈనె 1 నుంచి 31వ తేదీ వరకు 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.

30 పోలీసు యాక్టు అమలు : డీఎస్పీ

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 1 : ప్రొద్దుటూరు పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఈనె 1 నుంచి 31వ తేదీ వరకు 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ యాక్టుకు లోబడి రాజకీయ నాయకులు, ప్రజలు నడుచుకోవాలన్నారు. పోలీ సు అనుమతి లేకుండా రాజకీయ సమావేశాలు, అందోళన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. కాదని నిర్వహిస్తే, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా మున్సిపల్‌ ఎన్నికల నేపఽథ్యంలో ఎన్నికల సంఘం నియమనిబంధనలను పాటించాలన్నారు.

Updated Date - 2021-03-02T05:10:45+05:30 IST