Bullet bike మెకానిక్‌ను నిండా ముంచిన అమెరికా ఆశ.. పదింతల శాలరీ వస్తుందనడంతో..

ABN , First Publish Date - 2021-10-22T22:27:00+05:30 IST

అతనో బైక్ మెకానిక్. మంచి పనితనం, నైపుణ్యం కారణంగా స్థానికంగా బాగా పేరు సంపాదించాడు. దాంతో ఆటోమెటిక్‌గా అతని మెకానిక్ షాపుకు గిరాకీ పెరిగింది.

Bullet bike మెకానిక్‌ను నిండా ముంచిన అమెరికా ఆశ.. పదింతల శాలరీ వస్తుందనడంతో..

హన్సీ, హర్యానా: అతనో బైక్ మెకానిక్. మంచి పనితనం, నైపుణ్యం కారణంగా స్థానికంగా బాగా పేరు సంపాదించాడు. దాంతో ఆటోమెటిక్‌గా అతని మెకానిక్ షాపుకు గిరాకీ పెరిగింది. ఆదాయం కూడా బాగానే ఉంది. ఇది గమనించిన స్థానికంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఆ మెకానిక్‌కు అమెరికా ఆశ చూపించారు. ఇదే పని అక్కడ చేస్తే ఇక్కడ సంపాదిస్తున్న దానికంటే పదింతల శాలరీ వస్తుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. నీ దగ్గర మంచి పనితనం ఉంది, నైపుణ్యానికి కొదవలేదు. అలాంటిది ఇక్కడ ఉండి ఏం చేస్తావు అమెరికా వేళ్లు. చాలా తక్కువ సమయంలో నీవు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం వెనకేసుకోవచ్చని చెప్పారు. అంతే.. మనోడు వాళ్ల మాటలను పూర్తిగా నమ్మేశాడు. ఇది గమనించిన వారిద్దరూ అమెరికా వెళ్లాలంటే రూ.30 లక్షలు ఖర్చు అవుతాయన్నారు. దానికి మెకానిక్ సరేనన్నాడు. రెండు దఫాల్లో వారికి ఆ మొత్తం ఇచ్చేశాడు. కానీ, ఏడాది గడిచిన వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎప్పుడు పంపిస్తారని అడిగితే ఇప్పుడు అప్పుడు అని చెబుతున్నారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లా హాన్సీలో చోటు చేసుకుంది.


ఈ క్రమంలో ఒకరోజు మాటల మధ్యలో శివంను వారిద్దరూ అమెరికా ఆశ చూపించారు. నీవు ఇక్కడ ఉంటే.. కేవలం బైక్ మెకానిక్‌గానే ఉండిపోతావు. అదే అమెరికా వెళ్తే.. చాలా తక్కువ సమయంలోనే నీ జీవితమే మారిపోతుంది. నీవు ఇక్కడ చేస్తున్న ఈ పని అక్కడ చేస్తే పదింతల డబ్బు వస్తుంది. హర్లే డేవిసన్, డుకటీ వంటి బడా సంస్థల్లో పనిచేసే అవకాశం కూడా ఉంటుందని మభ్యపెట్టారు. నీవు సరే అంటే.. తన బావ అమెరికాలోనే ఉన్నాడని, వెళ్లడం కూడా చాలా ఈజీ అని సుశీల్ అరోరా చెప్పుకొచ్చాడు. వారి మాటలు శివం పూర్తిగా నమ్మేశాడు. దాంతో వారిద్దరూ తమ ప్లాన్‌ను అమలు చేశారు. 


అమెరికా వెళ్లేందుకు రూ.30లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడంతో శివం వారికి మొదట రూ. 17లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో రూ.13 లక్షలు అప్పగించాడు. ఇలా రెండు దఫాల్లో వారికి రూ.30లక్షలు అప్పజెప్పాడు. ఇంత భారీ మొత్తం తీసుకున్న ఆ ద్వయం ఏడాది గడిచిన శివంను అమెరికాకు పంపించలేదు. అడిగితే అప్పుడు ఇప్పుడంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన శివం తాజాగా హాన్సీ పోలీసులను ఆశ్రయించాడు. సుశీల్ అరోరా, ప్రవీణ్ సోనీల మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.       


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శివం శర్మ అనే వ్యక్తికి హాన్సీలోని జైన్ స్ట్రీట్‌లో బుల్లెట్ బైక్ మెకానిక్ షాపు ఉండేది. శివంకు మంచి పనితనం, నైపుణ్యం ఉండడంతో స్థానికంగా తక్కువ సమయంలోనే మంచి పేరు వచ్చింది. దాంతో రోజూ అతని షాపుకు భారీ సంఖ్యలో కస్టమర్లు వచ్చేవారు. శివం షాపు పక్కనే బైక్స్ విడిభాగాలు విక్రయించే మరో షాపు ఉండేది. ఆ షాపు యజమాని అయిన సుశీల్ అరోరా చాలా రోజులుగా శివం షాపుకు భారీగా బైక్‌లు రిపేర్‌కు వస్తుండడం, ఆదాయం కూడా బాగానే ఉండడం గమనించాడు. దాంతో తన మిత్రుడైన ప్రవీణ్ సోనీతో కలిసి శివం నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజాలనే స్కేచ్ వేశాడు. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి తరచూ శివం మెకానిక్ షాపుకు వెళ్లేవారు. అలా బాగా పరిచయం పెంచుకున్నారు. 

Updated Date - 2021-10-22T22:27:00+05:30 IST