30,31 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి

ABN , First Publish Date - 2022-05-27T15:04:18+05:30 IST

ఈ నెల 30,31 తేదీల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయని, ఉద్యోగుల రెండు రోజుల సమ్మె అనే వదంతులను నమ్మొద్దని బ్యాంక్‌ ఉన్నతాధికారులు

30,31 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి

ఐసిఎఫ్‌(చెన్నై): ఈ నెల 30,31 తేదీల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయని, ఉద్యోగుల రెండు రోజుల సమ్మె అనే వదంతులను నమ్మొద్దని  బ్యాంక్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయమై బ్యాంక్‌ అధికారులు మాట్లాడుతూ, బ్యాంక్‌ శాఖల తగ్గింపు, ఉద్యోగుల బదిలీలకు నిరసన తెలియజేస్తూ సెంట్రల్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా ఉద్యోగులు ఈ నెల 30,31 తేదీల్లో సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి బ్యాంక్‌ ఉద్యోగుల సంఘ సమాఖ్య నిర్వాహకుల మధ్య జరిగిన చర్చలతో రాజీ కుదిరింది. దీంతో సమ్మె ఉద్యోగులు వాయిదావేశారు. సమ్మె పేరుతో వస్తున్న వదంతులు నమ్మొద్దని, 30,31 తేదీల్లో బ్యాంక్‌లు యధావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-27T15:04:18+05:30 IST