Viral Video: 8వ అంతస్తు.. కిటికీని పట్టుకుని వేలాడుతున్న బాలిక.. అయ్యో పాపం అని అంతా చూస్తుండగానే..

ABN , First Publish Date - 2022-05-14T21:13:38+05:30 IST

అది ఎనిమిది అంతస్తుల భవనం. తల్లిదండ్రులు ఇంట్లో లేరో ఏమో తెలియదు కానీ ఓ 3ఏళ్ల చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. కిటికీ దగ్గర ఆడుతూ ఆడుతూ ప్రమాదవశాత్తు వెనక్కి జారిపడింది. ఈ క్రమం

Viral Video: 8వ అంతస్తు.. కిటికీని పట్టుకుని వేలాడుతున్న బాలిక.. అయ్యో పాపం అని అంతా చూస్తుండగానే..

ఇంటర్నెట్ డెస్క్: అది ఎనిమిది అంతస్తుల భవనం. తల్లిదండ్రులు ఇంట్లో లేరో ఏమో తెలియదు కానీ ఓ 3ఏళ్ల చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. కిటికీ దగ్గర ఆడుతూ ఆడుతూ ప్రమాదవశాత్తు వెనక్కి జారిపడింది. ఈ క్రమంలో ఆ చిన్నారి.. భవనం పైనుంచి పూర్తిగా కింద పడిపోకుండా ఉండటానికి కిటికీ గ్రిల్ ఆసరాగా చేసుకుంది. మూడేళ్ల పాప.. కిటికీ గ్రిల్‌ను పట్టుకుని వేలాతుండటాన్ని చూసి స్థానికులు షాకయ్యారు. ‘అయ్యో పాపం’.. అంటూ హడావుడి చేశారే కానీ ఏ ఒక్కరూ ఆ చిన్నారిని రక్షించేందుకు సరైన చర్యలు తీసుకోలేదు. 



అదే సమయంలో స్నేహితుడితో కలసి అటుగా వెళ్తున్న సబిత్.. ఆ చిన్నారిని చూశాడు. మరో ఆలోచన చేయకుండా చిట్టితల్లిని రక్షించేందుకు రంగంలోకి దిగాడు. ఏడవ ఫ్లోర్‌కు వెళ్లి ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండానే స్నేహితుడి సహాయంతో చిన్నారిని కాపాడాడు. ఈ ఘటన కజకిస్తాన్‌ రాజధానిలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సబిత్ చేసిన పని స్థానిక ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. Nur-Sultan సిటీ డిప్యూటీ ఎనర్జీ మినిస్టర్ సబిత్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సబిత్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఎనిమిదవ అంతస్తులో పాప వేలాడుతూ కనిపించినపుడు తనను కాపాడాలనే ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్లినట్టు చెప్పారు. కాగా.. సబిత్‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.



Updated Date - 2022-05-14T21:13:38+05:30 IST

Read more