వివాదాస్పదంగా మారిన మసీద్‌ కాంప్లెక్స్‌

ABN , First Publish Date - 2022-01-25T06:09:54+05:30 IST

The mosque complex that has become controversial

వివాదాస్పదంగా మారిన మసీద్‌ కాంప్లెక్స్‌
మసీద్‌ కాంప్లెక్స్‌ ఎదుట నమాజ్‌ చేస్తూ నిరసన తెలుపుతున్న ముస్లింలు

బహిరంగ మార్కెట్‌ ప్రకారం కిరాయి ఇవ్వాలని కమిటీ డిమాండ్‌

అగ్రిమెంట్‌ ప్రకారం 3శాతం పెంచి ఇస్తామంటున్న దుకాణదారులు

మైనార్టీల మధ్య ముదురుతున్న వివాదం 

హుజూర్‌నగర్‌, జనవరి 24: పట్టణంలోని ఉస్మానియా మసీద్‌ కాంప్లెక్స్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దుకాణాల కిరాయి పెంచాలని మసీద్‌ కమిటీ కోరుతుండగా, అగ్రిమెంట్‌ ప్రకారం 3శాతం పెంచి ఇస్తామని దుకాణదారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ వ్యవహా రం చివరికి పోలీ్‌సస్టేషన్‌ వరకు వెళ్లింది. కమిటీ నిర్ణయించిన ప్రకారం కిరాయి చెల్లించడం లేదని ఈ నెల 23న రాత్రి కొంతమంది కమిటీ సభ్యులు దుకాణాలను బలవంతంగా బంద్‌ చేయించారు. దీంతో దుకాణదారులు వారిపై పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ వివాదం చిలికిచిలికి గాలివాన అవుతోంది.

ఉస్మానియా మసీద్‌ కాంప్లెక్స్‌లో మొత్తం 49దుకాణాలు ఉన్నాయి. వాటిలో 14 మంది దుకాణదారులు మసీద్‌ కమిటీ నిర్ణయించిన ప్రకా రం కిరాయి చెల్లిస్తున్నారు. మిగిలిన 35మంది దుకాణదారులు పాత కిరాయి చెల్లిస్తామని చెప్పడంతో కమిటీ తీసుకోవడం లేదు. దీంతో కిరాయిని వారు బ్యాంకులో జమ చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్న ఈ మసీద్‌ కాంప్లెక్స్‌ దుకాణాల విషయంలో మైనార్టీల్లో రెండు వర్గాలు గా ఏర్పడ్డాయి. కిరాయి పెంచి ఇవ్వాలని ఒక వర్గం, అగ్రిమెంట్‌ ప్రకా రం 3శాతం మాత్రమే పెంచి ఇస్తామని మరో వర్గం చెబుతోంది. కాం ప్లెక్స్‌లో తూర్పు భాగంలో 12 దుకాణాలు ఉన్నాయి.వీటికి రూ.2500 నుంచి రూ.4000 వరకు కిరాయి చెల్లిస్తున్నారు. దక్షిణ భాగంలో ఉన్న వారు రూ.1000 నుండి రూ.3వేల వరకు చెల్లిస్తున్నారు. కొత్త కాంప్లెక్స్‌ లో ఉన్న కొంతమంది మాత్రం కమిటీ నిర్ణయించిన కొత్త కిరాయి చెల్లిస్తున్నారు. పాత కిరాయిల ప్రకారం చెల్లిస్తే ఇమాంలు, మౌజన్లకు వేతనాలకు సరిపోడం లేదని కమిటీ వాదిస్తోంది. దీంతో పాటు మసీద్‌ను కొత్తగా నిర్మించాల్సి ఉన్నందున బహిరంగ వేలం ద్వారా లీజు పెంచాల ని కమిటీ పేర్కొంటోంది. ఇటీవల మతపెద్దలు, మైనార్టీ వర్గాలు సమావేశమై నిర్ణయించిన కిరాయిని చెల్లించాలని కమిటీ పేర్కొంటుంది.

వినూత్న నిరసన

మసీద్‌ దుకాణాల అద్దెలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ముస్లిం నా యకులు మసీద్‌ ఎదుట సోమవారం నమాజు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ గడువు ముగిసిన షాపులకు వక్ఫ్‌బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించి దుకాణాలు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఎండీ.అజీజ్‌పాషా, బిక్కెన్‌, మజీద్‌, రహీమ్‌, షంషుద్దీన్‌మున్నా, నయీమ్‌, ఖాసీమ్‌, సిరాజ్‌, జానీ, జాఫర్‌, ఖాదర్‌, ఇబ్రహీమ్‌, ముస్తఫా, అఖిల్‌, సలాలుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ మార్కెట్‌ ప్రకారం కిరాయి ఇవ్వాలి

మసీద్‌ కాంప్లెక్స్‌ దుకాణదారులు ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ ప్రకారం కిరాయి ఇవ్వాలి. ఉస్మానియా మసీద్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. లీజు ఒప్పందాలు, గడువు తేదీ ముగిసింది. మసీద్‌ అభివృద్ధి చెందాలంటే బహిరంగ వేలం ద్వారా దుకాణాలను కిరాయికి ఇవ్వాలి. 

- అజీజ్‌పాషా, ముస్లిం మైనార్టీ నేత

Updated Date - 2022-01-25T06:09:54+05:30 IST