శ్రీనగర్: శ్రీనగర్‌లోని రాంబాగ్ ప్రాంతంలో జరిగిన స్వల్పకాలిక కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు బుధవారం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. రాంబాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు. మిలిటెంట్ల సంచారం గురించి పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. రాంబాగ్‌లోని రద్దీ మార్కెట్‌లో కొద్దిసేపు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు నిర్ధారించబడుతోందని పోలీసులు తెలిపారు.