Jul 29 2021 @ 13:55PM

Raj kundra: ఉచ్చు బిగిసింది.. మూడు లక్షల జరిమానా!

అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్‌ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా వీరిద్దరికీ మరో షాక్‌ తగిలింది. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాల వయాన్‌ ఇండస్ట్రీస్‌పై మూడు లక్షల జరిమానా విధించింది. సెబీ (ఇన్సైడర్‌ ట్రేడింగ్‌ నిషేదం) నిబంధనలను ఉల్లఘించినందుకు ఈ పెనాల్టీ విధించినట్లు తెలిసింది. ఈ ఆర్డర్‌ అందిన 45 రోజులలోపు 3 లక్షల చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు ఈ సంస్థ ఉద్యోగులు రాజ్‌కుందద్రాకు వ్యతిరేకంగా పోలీసులకు కీలక సమాచారాన్ని అందించారు. పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట అయ్యి రిమాండులో ఉన్న ఆయనకు కోర్డు బెయిల్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే! పోర్న్‌ చిత్రాలు నిర్మించి ఆన్‌లైన్‌ విడుదల చేస్తున్న రాజ్‌ కుంద్రాకు గత ఏడాది ఆగస్టు, డిసెంబర్‌ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు ముంబై క్రేౖమ్‌ బ్రాంచ్‌ పోలీసులు వెల్లడించారు.