బస్టాండ్‌లో అర్ధరాత్రి ఓ చిన్నారి ఏడుపులు.. ప్రయాణీకులకు ఒంటరిగా కనిపించిన ముగ్గురు చిన్నారులు.. ఎవరు మీరని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-06-25T22:57:45+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ రోడ్‌వేస్ బస్టాండ్.. శుక్రవారం అర్ధరాత్రి.. తన అన్నయ్య, అక్కతో కూర్చున్న ఏడాదిన్నర బాలుడి ఏడుపులు వినిపించాయి..

బస్టాండ్‌లో అర్ధరాత్రి ఓ చిన్నారి ఏడుపులు.. ప్రయాణీకులకు ఒంటరిగా కనిపించిన ముగ్గురు చిన్నారులు.. ఎవరు మీరని ఆరా తీస్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ రోడ్‌వేస్ బస్టాండ్.. శుక్రవారం అర్ధరాత్రి.. తన అన్నయ్య, అక్కతో కూర్చున్న ఏడాదిన్నర బాలుడి ఏడుపులు వినిపించాయి.. ఆ కుర్రాడి ఏడుపులు విన్న ప్రయాణికులు వారి తల్లిదండ్రుల గురించి వెతికారు.. ఎక్కడా వారి ఆచూకీ లభించలేదు.. మీది ఏ ఊరు? అమ్మానాన్నల పేర్లు ఏంటి? అని అడిగితే ముగ్గురిలో ఎవరూ చెప్పలేక పోయారు. దీంతో ప్రయాణికులు ఛైల్డ్ లైన్ బృందానికి సమాచారం అందించారు. వారు ఆ ముగ్గురు పిల్లలను తమ కేంద్రానికి తరలించారు. 


ఇది కూడా చదవండి..

పాము కాటు వేసిన చోటకు తీసుకురా.. నీ భార్యను బతికిస్తా.. భర్తకు తేల్చిచెప్పిన మాంత్రికుడు.. సరేనని అతడు తీసుకెళ్తోంటే..


ఆ ముగ్గురిలో ఒకరి వయసు సుమారు ఏడాదిన్నర కాగా, బాలికకు 3 ఏళ్లు, పెద్ద అబ్బాయికి 5 ఏళ్లు ఉండొచ్చని ఛైల్డ్ లైన్ బృందం భావిస్తోంది.  చైల్డ్ లైన్ టీమ్, పోలీసులు ఆ ముగ్గురు చిన్నారుల చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వారి కుటుంబాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ముగ్గురిలో పెద్ద అబ్బాయి తమ పేర్లు మాత్రమే చెబుతున్నాడు. తన పేరు అకీల్ అని, అమ్మాయి పేరు చంచల్ అని, చిన్న పిల్లవాడి పేరు బాబు అని చెప్పాడు. అంతకు మించి తన తల్లిదండ్రుల వివరాలు, ఊరి వివరాలు చెప్పడం లేదు. వారిని వారి కుటుంబంతో తిరిగి కలిపేందుకు పోలీసులు, చైల్డ్ లైన్ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-06-25T22:57:45+05:30 IST