సింగపూర్‌లో భారతీయ యువత వీడియో వైరల్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-27T00:23:52+05:30 IST

ఇండియాకు చెందిన ముగ్గరు యువకుల వీడియో సింగపూర్‌లో వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతోంది. నేరం

సింగపూర్‌లో భారతీయ యువత వీడియో వైరల్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నేరం ఏంటంటే..

ఎన్నారై డెస్క్: ఇండియాకు చెందిన ముగ్గరు యువకుల వీడియో సింగపూర్‌లో వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది. నేరం రుజువైతే ముగ్గురికీ 6నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇండియాకు చెందిన హర్జన్ సింగ్, వర్మా పుల్కిత్, కొట్రా వెంకట సాయి అనే ముగ్గరు యువకులు కరోనా నిబంధనలు ఉల్లఘించి న్యూయర్ వేడుకలు చేసుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీసుకుని హల్‌చల్ చేశారు. అవికాస్తా వైరల్ అయ్యాయి. దీంతో ఈ యువకులకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. భౌతిక దూరం, మాస్క్ ధరించకుండా వేడుకలు చేసుకున్న కారణంగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది. నేరం రుజువైతే ఈ ముగ్గురు యువకులు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించడంతోపాటు భారీ మొత్తంలో ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.




Updated Date - 2022-01-27T00:23:52+05:30 IST