Abn logo
Oct 14 2021 @ 12:39PM

నేలకూలిన మూడంతస్తుల building

                - ప్రమాదపుటంచున మరో అనుబంధ భవనం


బెంగళూరు: బెంగళూరు మహాలక్ష్మి లే అవుట్‌కు అనుబంధమైన కమలానగర్‌లో మూడంతస్తుల భవనం నేలకూలింది. నగరంలో ఇటీవల నెలరోజులుగా వరుసగా భవనాలు కూలిపోతుండటం ప్రజలను కలవరపెడుతోంది. కమలానగర్‌లో రాజేశ్వరి అనే మహిళకు చెందిన భవనం మంగళవారం రాత్రి ఓవైపు పక్కకు ఒరిగింది. వెంటనే మూడంతస్తుల భవనంలోని నాలుగు కుటుంబాలకు చెందినవారు బయటకు వచ్చేశారు. బుధవారం ఉదయం బెంగళూరు పాలికె అధికారులు పక్కకు వాలిన భవనాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. నాలుగు కుటుంబాలకు చెందినవారు ఎటువంటి వస్తువులను బయటకు తీసుకురాలేకపోయారు. బంగారు ఆభరణాలు, ఇతరత్రా వస్తువులు కూడా వదిలేసుకున్నారు. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అనుబంధంగా ఉండే మరో భవనం ప్రమాదస్థితికి చేరింది. అధికారులు సదరు భవనంలో నివసించేవారిని బయటకు వచ్చేలా ఆదేశించారు. సదరు భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption