Abn logo
Aug 3 2021 @ 08:58AM

అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. ముగ్గురు మృతి!

గ్రీన్‌వుడ్, దక్షిణ కరోలినా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ కరోలినాలోని గ్రీన్‌వుడ్ కౌంటీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో యూఎస్ హైవే-25కు కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రీన్​వుడ్ కౌంటీ హోమ్​ వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీస్ అధికారి కాడీ బిషప్ వెల్లడించారు. కాగా, ఈ కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న జెఫ్రీ డేవిడ్ పావెల్(36) అనే వ్యక్తి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనపై గ్రీన్​వుడ్ కౌంటీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.    

తాజా వార్తలుమరిన్ని...