Abn logo
Aug 15 2020 @ 18:39PM

ఏపీలో రాగల 3 రోజులు భారీ వర్షాలు

అమరావతి: అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అలలు 3.5 నుంచి 4.3 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కన్నబాబు హెచ్చరించారు.


16వ తేది (ఆదివారం) విశాఖ, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 17వ తేది (సోమవారం)  విజయనగరం, విశాఖ జిల్లాలో అక్కడక్కడ  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ ప్రకటించింది. 18వ తేది (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement