Jul 14 2021 @ 17:42PM

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఒక్క పాటకే 3కోట్ల బడ్జెట్..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజ్కమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో ఒక్క పాటకే 3కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తాజాగా వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ - మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఇందులో అలియా భట్‌, ఒలీవియా మోరీస్‌ వారికి జంటగా కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఆలియా భట్ మీద ఈ భారీ బడ్జెట్ పాటను చిత్రీకరించనున్నారట. కేవలం ఆమె కాస్ట్యూమ్స్‌ కోసం దాదాపు రూ.కోటి ఖర్చు చేస్తునట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి బృందం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.