ఒకే పాలసీ మూడు ప్రయోజనాలు

ABN , First Publish Date - 2020-07-12T06:15:17+05:30 IST

భారతీ ఆక్సా లైఫ్‌ సరికొత్త ఆరోగ్య, జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. కొవిడ్‌-19 నేపథ్యంలో లైఫ్‌ కవర్‌, హాస్పిటల్‌ ఖర్చులు, తీవ్ర అనారోగ్యం కూడా ఈ పాలసీ కింద కవర్‌ అవుతాయి. కరోనా వైరస్‌ విస్తరణ కారణంగా ఆరోగ్యం, జీవిత భద్రత చాలా ముఖ్యంగా మారాయి...

ఒకే పాలసీ మూడు ప్రయోజనాలు

  • భారతీ ఆక్సా నుంచి కొత్త పాలసీ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారతీ ఆక్సా లైఫ్‌ సరికొత్త ఆరోగ్య, జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. కొవిడ్‌-19 నేపథ్యంలో లైఫ్‌ కవర్‌, హాస్పిటల్‌ ఖర్చులు, తీవ్ర అనారోగ్యం కూడా ఈ పాలసీ కింద కవర్‌ అవుతాయి. కరోనా వైరస్‌ విస్తరణ కారణంగా ఆరోగ్యం, జీవిత భద్రత చాలా ముఖ్యంగా మారాయి. దీంతో పాలసీదారుల అవసరాల మేరకు ఈ పాలసీని  ప్రవేశపెట్టామని భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ పరాగ్‌ రాజా తెలిపారు. ఆరోగ్య, జీవిత భద్రతకు భారతీ ఆక్సా లైఫ్‌ ఫ్లెక్సీ టర్మ్‌ ప్లాన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. దీనికి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఆప్షన్‌ ఉంటుంది. లైఫ్‌హాస్పీ క్యాష్‌ బెనిఫిట్‌ రైడర్‌, ప్రమాదవశాత్తు మరణిస్తే కలిగే ప్రయోజన రైడర్‌ పాలసీదారులకు మరింత భద్రత కల్పిస్తుంది. ఆరోగ్య సంరక్షణలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుం ది. గరిష్ఠంగా జీవిత బీమా కల్పించే వయసు 75 ఏళ్లు. రూ.15 నుంచి 20 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది.


Updated Date - 2020-07-12T06:15:17+05:30 IST