పుట్టినప్పుడు బాలిక బరువు 2.5 కేజీలు .. 2 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా 45 కేజీలు!

ABN , First Publish Date - 2021-08-04T02:01:03+05:30 IST

పుట్టినప్పుడు ఆ చిన్నారిది కూడా అందరిలాగే సాధారణ బరువే. కానీ..వయసు పెరిగేకొద్దీ ఆమెలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రెండేళ్ల వయసొచ్చేసరికే ఆమె బరువు 45 కేజీలకు చేరుకుంది.

పుట్టినప్పుడు బాలిక బరువు 2.5 కేజీలు ..  2 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా 45 కేజీలు!

న్యూఢిల్లీ: పుట్టినప్పుడు ఆ చిన్నారిది కూడా అందరిలాగే సాధారణ బరువే. కానీ..వయసు పెరిగేకొద్దీ ఆమెలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రెండేళ్ల వయసొచ్చేసరికే ఆమె బరువు 45 కేజీలకు చేరుకుంది.  బుడిబుడి నడకలతో తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపాల్సిన ఆ చిన్నారి చక్రాల కుర్చీకి పరిమితమైపోయింది. అయితే..ఆధునిక వైద్య విజ్ఞానం ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. ఢిల్లీలోని పత్పర్‌గంజ్‌లోగల మ్యాక్స్‌ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు ఇటీవల ఆ బాలికకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో వైద్యులు ఆమె పొట్టపరిమాణాన్ని కొంత మేర తగ్గించారు. పొట్ట పరిమాణం తగ్గడంతో ఆమె తీసుకునే ఆహార పరిమాణం కూడా తగ్గి బాలిక క్రమంగా బరువుకోల్పోతుందని వారు తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వారు తాజాగా మీడియాతో పంచుకున్నారు. గత పదేళ్లలో తొలిసారిగా భారత్‌లో ఇటువంటి బేరియాట్రిక్ సర్జరీ జరిగిందని తెలిపారు. మరో సంవత్సరంలో ఆమె సాధారణ స్థితికి చేరుకుంటుందని అక్కడి వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-04T02:01:03+05:30 IST