2 వేల మందికి ‘ఆనందయ్య మందు’ పంపిణీ

ABN , First Publish Date - 2021-07-28T12:56:43+05:30 IST

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) ఆధ్వర్యంలో మంగళవారం 2 వేల మందికి పైగా సరిపడా నెల్లూరుకు చెందిన ‘ఆనందయ్య ఆయుర్వేద మందు’ పంపిణీ చేశారు. స్థానిక చూలైమేడు, తిరువళ్లువర్‌ మొదటివీధి

2 వేల మందికి ‘ఆనందయ్య మందు’ పంపిణీ

- ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

- ‘వామ్‌’ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ


చెన్నై: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) ఆధ్వర్యంలో మంగళవారం 2 వేల మందికి పైగా సరిపడా నెల్లూరుకు చెందిన ‘ఆనందయ్య ఆయుర్వేద మందు’ పంపిణీ చేశారు. స్థానిక చూలైమేడు, తిరువళ్లువర్‌ మొదటివీధిలో వున్న ‘నాన్నా హోమ్‌’ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మందు పొట్లాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, వామ్‌ గ్రేటర్‌చెన్నై విభాగ అధ్యక్షుడు బెల్లం కొండ శివప్రసాద్‌, పీఏసీ రంగనాయకులు, పేర్ల బద్రీ నారాయణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయుర్వేద మందు కోసం వచ్చిన ఔత్సాహికులు అడిగిన సందేహాలను తంగుటూరి రామకృష్ణ నివృత్తి చేశా రు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంగా వుండాలన్న తలంపుతో భారీ వ్యయాన్ని వెచ్చించి ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నామన్నారు. కేవలం తమ సంస్థ సభ్యులతో సరిపెట్టకుండా, ప్రజల సంక్షేమం కోరి అన్ని వర్గాల వారికి ఈ మందు అందిస్తున్నామన్నారు. కులమతభేదాలు లేకుండా ఔత్సాహికులంద రికీ ఈ మందు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వర కూ మొత్తం మూడుమార్లు నగరంలో ఆనందయ్య మందు పంపిణీ చేశామని, ఈ కార్యక్రమం ద్వారా వేలాదిమంది లబ్ధి పొందారన్నారు. కరోనా మహమ్మారి విపత్కాలంలో, ప్రజలు దానిని తట్టుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి పెంచేందుకు ఈ ఆయుర్వేద మందు ఉపయోగపడు తుందన్న ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ మందు వాడినా ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. బుధవారం కూడా ఈ మందు పంపిణీ వుంటుందని, అయితే స్థానిక ప్యారీస్‌లోని గోవిందప్పనాయకన్‌ వీధిలో వున్న డోర్‌ నెంబరు 12లో ఈ మందు అందిస్తామని తంగుటూరి వివరించారు.

Updated Date - 2021-07-28T12:56:43+05:30 IST