Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగిసిన రెండో రోజు ఆట.. 332 పరుగులకు చేరిన టీమిండియా ఆధిక్యం

ముంబై: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని భారత్ లీడ్ 332 పరుగులకు చేరింది. ఆట ముగిసే సమయానికి మయాంక్ అగర్వాల్ 38, చతేశ్వర్ పుజారా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఈ ఉదయం 221/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చకచకా వికెట్లు కోల్పోయింది. 325 పరుగులకు ఆలౌట్ అయింది. 


అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. 62 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇక భారత ఆటగాళ్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లను అజాజ్ పటేల్‌కు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు, సిరాజ్ మూడు, అక్షర్ పటేల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.


Advertisement
Advertisement