ఉత్సాహంగా 2కే రన్‌

ABN , First Publish Date - 2022-08-12T04:55:28+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 2కే రన్‌ నిర్వహించారు. ఈ పరుగులో అధికారులు, ప్రజాప్రతినిఽ దులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములయ్యారు.

ఉత్సాహంగా 2కే రన్‌
ఎర్రుపాలెంలో 2కే రన్‌ నిర్వహిస్తున్న అధికారులు

వజ్రోత్సవ వేళ ప్రభవించిన స్వాతంత్య్ర స్ఫూర్తి

కారేపల్లి/ ఏన్కూరు/ చింతకాని/ మధిరటౌన్‌/ కొణిజర్ల/ వైరా/ సత్తుపల్లి/ ముదిగొండ/ పెనుబల్లి/ కల్లూరు/ ఖమ్మం రూరల్‌/ రఘునాథపాలెం/ ఖమ్మం కార్పొరేషన్‌/  కామేపల్లి/ తిరుమలాయపాలెం, ఆగస్టు11: స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 2కే రన్‌ నిర్వహించారు. ఈ పరుగులో అధికారులు, ప్రజాప్రతినిదులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములయ్యారు.

కారేపల్లిలో..

కారేపల్లిలో 2కే రన్‌ విజయవంతమైంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వ హించారు. విద్యార్థులు, క్రీడాకారులు భారత్‌ మాతాకీ జై అంటూ నినదించారు.

ఏన్కూరులో..

ఏన్కూరులో ఉత్సాహంగా 2కే రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, జడ్పీటీసీ బుజ్జి, తహసీల్దార్‌ మహమ్మద్‌షా ఖాసీం, ఎంపీడీవో అశోక్‌, ఎం ఈవో జయరాజు, ఏవో నర్సింహారావు, ఎస్‌ఐ సాయి కు మార్‌, మండల వైద్యాధికారి పవన్‌ కుమార్‌, గురుకుల పా ఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, కస్తూర్బాగాంధీ ఎస్‌వో ఉ షారాణి, ఉపసర్పంచ్‌ రమేష్‌బాబు, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్లు వెంకటమ్మ, రేఖబాయి గ్రామస్థులు పాల్గొన్నారు.

చింతకానిలో..

చింతకాని మండల కేంద్రంలో 2కే రన్‌ విజ యవంతంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నుంచి నరసింహపురం గ్రామం వరకు పరు గు పందెం నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమ తులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దొడ్డ ప్రవీ ణ, సుభద్ర, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని కిషోర్‌, తహసీల్దార్‌ మాలోత్‌ మంగీలాల్‌, ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంన్న, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్‌  పాల్గొన్నారు. 

నాటి చరిత్ర తెలిపేందుకే..

పోరాట చరిత్ర నేటి తరానికి తెలిపేందుకే.. స్వాతం త్రో ద్యమ నాటి వీరుల పోరాట చరిత్ర నేటి తరానికి తెలి పేందుకే వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని మధిర కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ కుమార్‌ అన్నారు. గురు వారం మధిర లో సిఐ వడ్డేపల్లి మురళి ఆద్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ ను ఆయన జెండా ఊపి ప్రారంభిం చారు. ప్రీడం రన్‌లో పాల్గొన్న వారందరికి మల్లాది సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఫౌండర్‌ మల్లాది వాసు టీషర్ట్‌లు, క్యాప్‌ లు ఉచితంగా అందచేశారు. కార్యక్రమాల్లో తహసీ ల్దార్‌ రాంబాబు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మొండితోక లత, కమిష నర్‌ రమాదేవి, సీఐ మురళి, ఎంపీడీవో విజయ భాస్క రరెడ్డి, టౌన్‌, రూరల్‌ ఎస్‌ఐలు సతీష్‌ కుమార్‌, నరేష్‌ కుమార్‌, ఎంఈవో ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొణిజర్లలో..

స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా గురువారం పొలీస్‌ శాఖ, అధికారులు, ప్రజాప్రనిధుల ఆధ్వర్యంలో కొణిజర్లలో టూకే రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో తహ సీల్దార్‌ సైదులు, ఎస్‌ఐ యయాతిరాజు, ఎంపీ డీవో రమా దేవి, సర్పంచ్‌ సూరంపల్లి రామారావు, ఎంపీపీ గోసు మ ధు, జడ్పీటీసీ పోట్ల కవిత, టిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు చల్లా మోహన్‌రావు పాల్గొన్నారు. 

వైరాలో ఫ్రీడమ్‌ ర్యాలీ

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని గు రువారం వైరాలో ఫ్రీడమ్‌ ర్యాలీని నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జెండా ఊపి ఫ్రీడమ్‌ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఏసీపీ ఎంఏ.రెహ్మాన్‌, సీఐ తాటి పాముల సురేష్‌, ఎస్‌ఐ శాఖమూరి వీరప్రసాద్‌, ముని సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతారాములు, కమిషనర్‌ ఎన్‌.వెంకటపతిరాజు, ఏఎంసీ చై ర్మన్‌ బీడీకే.రత్నం, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌.లాల్‌మహ్మద్‌, ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సిరిపురంలో ర్యాలీ, మాన వహారం నిర్వహించారు. సర్పంచ్‌ మట్టూరి సత్యప్ర సన్నాంబ, పంచాయతీ కార్యదర్శి ఎస్‌.హన్మంతరావు, రైతు బంధు జిల్లా కమిటీ సభ్యుడు మచ్చా నర్సింహారావు, మాజీ ఎంపీటీసీ బుజ్జి, ఆలయ కమిటీ చైర్మన్‌ మోరంపూడి బాబూరావు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో ఉత్సాహంగా 2కే రన్‌

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సత్తుపల్లిలో గురువారం ఉత్సాహంగా 2కే రన్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కల్లూరు ఎసీపీ ఎన్‌.వెంకటేష్‌ రన్‌ ప్రారంభించారు. స్థానిక జ్యోతినిలయం హైస్కూల్‌ నుంచి రెండు కిలోమీటర్ల మేర 2కే రన్‌ నిర్వహించారు. రన్‌లో సత్తుపల్లి తహసీల్దార్‌ టి.శ్రీనివాసరావు, సీఐ కరుణాకర్‌, కమిషనర్‌ సుజాత, ఎస్సై షాకీర్‌, ఎన్‌సీసీ కేడేట్లు పాల్గొన్నారు. 

టూకే రన్‌ విజయవంతం

స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తల్లాడ మం డలంలో గురువారం టూకే రన్‌ నిర్వహించారు. మం డలం లోని రెడ్డిగూడెం నుంచి తల్లాడ రింగ్‌రోడ్డు సెంటర్‌ వరకు టూకే రన్‌ నిర్వహించారు. క్రీస్తూజ్యోతి, బాలభారతి విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. రింగ్‌రోడ్డు సెంటర్లో జరిగిన సభలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీడీవో బి.రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ పి.సురేష్‌, సొసైటీ చైర్మన్‌ రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ఎంఈవో ఎన్‌.దామోదర్‌ప్రసాద్‌, రైతుబంఽ దు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, సర్పంచ్‌ సంధ్యారాణి, పాదర్‌ ప్రాన్సీస్‌ ప్రసంగించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ముదిగొండలో..

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముదిగొండ మండలంలో గురువారం నిర్వహించిన టూకే రన్‌ విజయవంతమైంది. టూకే రన్‌ను ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ టూకేరన్‌లో వందలాదిగా యువతీయువకులు పాల్గొన్నారు. అనంతరం ఎస్‌ఐ తోట నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టూకే రన్‌లోని విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దుర్గ, తహసీల్దార్‌ దామోదర్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, సర్పంచ్‌ లక్ష్మీ, వెంకన్న, లక్ష్మారెడ్డి, అనంతరాములు, సుధాకర్‌, వెంకట్‌, మల్లయ్య, ధర్మా, రాజు పాల్గొన్నారు.

పెనుబల్లిలో..

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం వీఎం బంజర్‌లో ఫ్రీడమ్‌ టూకే రన్‌ను ఎంపీపీ లక్కినేని అలేఖ్య ప్రారంభించారు. రింగ్‌సెంటర్‌ నుంచి బయ్యన్నగూ డెం వరకు ఈ టూకేరన్‌ కొనసాగింది. కార్యక్రమంలో జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో మహాలక్ష్మీ, ప్రత్యేక అధికారి కె.నాగరాజు, సీఐ హనుక్‌, ఎస్‌ఐ సూరజ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావ్‌, మండల కార్యదర్శి భూక్యా ప్రసాద్‌, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు సురేష్‌బాబు, సర్పంచ్‌ల సంఘం మందడపు అశోక్‌కుమార్‌, లంకాసాగర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి శాంతారాణి, సర్పంచ్‌లు భూక్యా పంతులీ, తావూనాయక్‌ పాల్గొన్నారు.

కల్లూరులో..

75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా కల్లూరులో గురువారం పోలీసుశాఖ ఆధ్వ ర్యంలో ఫ్రీడమ్‌ 2కే రన్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూత న బస్టాండ్‌ నుంచి మెయిన్‌ సెంటర్‌ మీదుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు 2 కె రన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్‌ జండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీడీవో రవికుమార్‌, తహసీల్దార్‌ బాబ్జీప్రసాద్‌, రైతుబంధు ప్రతినిధులు డాక్టర్‌ లక్కి నేని రఘు, పసుమర్తి చందర్‌రావు, కో-ఆప్షన్‌ సభ్యులు ఎండీ ఇస్మాయిల్‌, కమ్లీ, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ కాటంనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.  

విజేతలకు బహుమతుల అందజేత

కల్లూరులో మండల స్థాయిలో ఆర్యవైశ్య,లయన్స్‌క్లబ్‌ ఆ ధ్వర్యంలో  సంయుక్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ప్రభుత్వ, ప్రవైట్‌ పాఠశాలల విద్యార్థులకు స త్తుపల్లి రూరల్‌ సీఐ హనుక్‌, రైతు బంధు జిల్లా ప్రతినిధి పసుమర్తి చందర్‌రావు, ఎస్‌ఐ వెంకటేష్‌ చేతులమీదగా నగ దు, మెమొంటోలు అందజేశారు.స్వాతంత్య్ర వజ్రో త్సవాల సందర్భంగా ఉద్యమ చరిత్ర, మహానీయుల విశిష్టత గురిం చి మండల స్థాయిలో విద్యార్థులకు వేరువ్వేరుగా వ్యాసర చన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సం ఘం అధ్యక్షుడు రామకృష్ణ,(రాంబాబు), లయన్స్‌ క్లబ్‌ అధ్య క్ష, కార్యదర్శులు నగేష్‌, సురేష్‌, పుల్లారావు, నాగేశ్వరావు, అ చ్యుత, రాంబాబు, భాస్కరరావు, మౌలాలి, నాగేశ్వరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

ఖమ్మం రూరల్‌ మండలంలో..

వజ్రోత్సవాలలో భాగంగా ఖమ్మం రూరల్‌ మండలంలో గురువారం 2కే రన్‌ నిర్వహిం చారు. కార్యక్రమాన్ని తహసీ ల్దార్‌ సుమ, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎంపీడీవో అశోక్‌ కుమా ర్‌, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో శ్రీదేవి, ఎస్‌ఐ శంకర్‌రావు పాల్గొన్నారు.

రఘనాథపాలెంలో..

రఘనాథపాలెంలో 2కే రన్‌ను ఎస్‌ఐ రవి జాతీయ జెం డాను ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ న ర్సింహారావు, ఎంపీడీవో రామకృష్ణ, వెంకటరమణ, మం దడపు సుధాకర్‌రావు, గుడిపూడి రామారావు, ఏఎస్‌ఐ  వెం కటేశ్వర్లు పోలీసు సిబ్బంది చందు, నాగేశ్వరరావు, రాం మ్మూర్తి, రవికిషోర్‌, శోభన్‌, కృష్ణ పాల్గొన్నారు.

జాతీయజెండాను ఆవిష్కరించిన ఎంపీ నామా

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు గురువారం తన నివాసంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా నామా రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ నల ్లమల వేంకటేశ్వరరావు, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి తన నివాసంలో మొక్కలు నాటారు. 

కామేపల్లిలో..

కామేపల్లి క్రాస్‌రోడ్‌ నుంచి ఉటుకూరు వరకు 2కే రన్‌ ర్యాలీని తహసీల్దార్‌ కృష్ణ గురువారం ఎదయం ప్రారం భించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సిలార్‌ సాహెబ్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, డీటీ రవిందర్‌, ఏపీఎం సురేందర్‌, సూపర్‌ వైజర్లు పార్వతి, సర్పంచ్‌ రాందాస్‌ పాల్గొన్నారు. 

తిరుమలాయపాలెంలో..

తిరుమలాయపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో ఫ్రీడమ్‌ 2కెరన్‌ నిర్వహించారు. అనంతరం  ప్రదర్శన చేపట్టారు. తిరుమలాయపాలెంలో ఈ ర్యాలీని ఎంపీపీ బోడా మంగీలాల్‌ ప్రారంభించారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ పుల్లయ్య, ఎంపీడీవో జయరామ్‌, ఎస్పై శ్రీనివాస్‌, సర్పంచ్‌లు కొండబాల వెంకటేశ్వర్లు, రాయల నాగేశ్వరరావు, శైలజ, పిండిప్రోలు కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T04:55:28+05:30 IST