యూఏఈలో మరో 294 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-04-06T13:57:04+05:30 IST

యూఏఈలో కొత్తగా 294 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 1799కి చేరినట్టు పే

యూఏఈలో మరో 294 కరోనా కేసులు నమోదు

అబూధాబీ: యూఏఈలో కొత్తగా 294 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 1799కి చేరినట్టు పేర్కొంది. మరోపక్క కరోనాను 19 మంది జయించారని తెలిపింది. యూఏఈలో ఏప్రిల్ 5 వరకు మొత్తంగా 144 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్న వారిలో అనేక మంది విదేశీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. కరోనాను పూర్తిగా నియంత్రించే క్రమంలో స్టెరిలైజేషన్ పోగ్రామ్‌ను విస్తరించినట్టు సుప్రీం కమిటి ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శనివారం ప్రకటించింది. మరో రెండు వారాల పాటు ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచే ఈ నిబంధనలు అమలులోకి వచ్చినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-06T13:57:04+05:30 IST