289కి పెరిగిన ఆర్టీసీ బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2020-06-05T09:54:05+05:30 IST

ఆర్టీసీ క్రమంగా బస్సు సర్వీసులు పెంచుతోంది. ఆదాయమూ పెరుగుతోంది. లాక్‌డౌన్‌తో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ ..

289కి పెరిగిన ఆర్టీసీ బస్సు సర్వీసులు

అనంతపురం టౌన్‌, జూన్‌ 4: ఆర్టీసీ క్రమంగా బస్సు సర్వీసులు పెంచుతోంది. ఆదాయమూ పెరుగుతోంది. లాక్‌డౌన్‌తో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఆంక్షల సడలింపులతో మే 21న పునరుద్ధరించారు. జిల్లాలో తొలిరోజు 111 బస్సులను కేటాయించగా... ప్రజలు ప్రయాణానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో 94 బస్సులే రోడ్డెక్కగా, టికెట్ల రూపంలో దాదా పు రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సు సర్వీసులనూ పెంచారు. ప్రస్తుతం రీజియన్‌లో రోజువారిగా 289 సర్వీసులు తిరుగుతున్నాయి. టికెట్ల రూపంలో వస్తు న్న ఆదాయం రూ.23 లక్షలకు చేరుకుంది.


గురువారం రీజియన్‌ వ్యాప్తంగా 277 బ స్సులను తిప్పాలనుకున్నా... ప్రయాణికులు అధికంగా ఉండడంతో మరో 12 బస్సులు పెంచారు. కరోనా భౌతికదూరం నిబంధన నేపథ్యంలో బస్సుల్లో సీటింగ్‌ సామర్థ్యాన్ని తగ్గించారు. బస్సుల ద్వారా వచ్చే కలెక్షన్‌ కూడా తగ్గింది. ప్రస్తుతం హిందూపురం డిపో మినహా మిగిలిన 12 డిపోల పరిధిలో రోజు కు 280కు పైగా బస్సులు రోడ్డెక్కుతున్నా వాటిద్వారా రూ.23 లక్షల మేర మాత్రమే టికెట్ల రూపంలో రోజువారి కలెక్షన్‌ వస్తోం ది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఆర్టీసీ యం త్రాంగం సంస్థ ఆదాయాన్ని పెంచుకునే యోచనలో పడింది. ఈనెల 8 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులివ్వనున్న తరుణంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా పెంచనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ జిల్లా అధికారులు రాష్ట్ర యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.


డిమాండ్‌ మేరకు సర్వీసులు పెంచుతాం.. గోపాల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం

ఎక్కువమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రూట్లకు తొలిప్రాధాన్యతగా బస్సు సర్వీసులు పెంచుతాం. లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులు వస్తే ఆ మేరకు మరిన్ని సర్వీసులు పునరుద్ధరిస్తాం. భౌతికదూరం నిబంధన వల్ల సీట్ల సంఖ్య తగ్గింది. దీంతో గతంతో పోలిస్తే టికెట్ల రూపంలో సంస్థ ఆదాయం దాదాపు 50 శాతం తగ్గింది. డిమాండ్‌ అధికంగా ఉన్న రూట్లను పరిశీలించి, త్వరలోనే మరిన్ని సర్వీసులు పెంచనున్నాం.

Updated Date - 2020-06-05T09:54:05+05:30 IST