Abn logo
Oct 19 2021 @ 01:24AM

కలెక్టరేట్‌లో ‘స్పందన’కు 289 అర్జీలు

అర్జీని పరిశీలిస్తున్న జేసీ రాజాబాబు

చిత్తూరు, అక్టోబరు 18: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 289 అర్జీలు అందాయి. బాధితుల నుంచి కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీలు రాజాబాబు, శ్రీధర్‌, వెంకటేశ్వర్‌, రాజశేఖర్‌, డీఆర్వో మురళి వినతి పత్రాలను స్వీకరించారు. అర్జీల్లో.. రెవెన్యూశాఖకు 124, డీఆర్‌డీఏకు 53, సంక్షేమ శాఖలకు 28, పౌరసరఫరాల శాఖకు 17, మున్సిపాలిటీలకు 17, హౌసింగ్‌కు 11, పోలీస్‌శాఖకు 7, ఇతర శాఖలకు 32 ఉన్నాయి.