‘ఫేక్‌స్పాట్‌’కు రూ.28 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2020-12-05T06:50:14+05:30 IST

డేటా అథెంటికేషన్‌ స్టార్టప్‌ కంపెనీ ఫేక్‌స్పాట్‌కు 40 లక్షల డాలర్ల (దాదాపు రూ.28 కోట్లు) సీరీస్‌ ఏ నిధులు లభించాయి. బుల్‌పెన్‌ క్యాపిటల్‌, 500 స్టార్టప్స్‌, ఫెయిత్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌...

‘ఫేక్‌స్పాట్‌’కు రూ.28 కోట్ల నిధులు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డేటా అథెంటికేషన్‌ స్టార్టప్‌ కంపెనీ ఫేక్‌స్పాట్‌కు 40 లక్షల డాలర్ల (దాదాపు రూ.28 కోట్లు) సీరీస్‌ ఏ నిధులు లభించాయి. బుల్‌పెన్‌ క్యాపిటల్‌, 500 స్టార్టప్స్‌, ఫెయిత్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌  ఈ నిధులను అందించాయి. అమెరికాకు చెందిన ఫేక్‌స్పాట్‌ స్టార్ట్‌పలో హైదరాబాద్‌, ఫిలడేల్ఫియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీ క్యాపిటల్‌ రెండేళ్ల క్రితం 10 లక్షల డాలర్ల (దాదాపు రూ.7 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. అమెజాన్‌, ట్రిప్‌అడ్వైజర్‌ వంటి ఈ-కామర్స్‌, ట్రావెల్‌ పోర్టళ్లలో నకిలీ రివ్యూలు, నకిలీ విక్రయదారులను పసిగట్టడానికి ఫేక్‌స్పాట్‌ సొల్యూషన్లను అందిస్తోంది.  

Updated Date - 2020-12-05T06:50:14+05:30 IST