280 మందికి కరోనా.. నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-07-28T06:46:09+05:30 IST

చిత్తూరు జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల్లో 280 మందికి కరోనా సోకగా, కొవిడ్‌తో నలుగురు మృతి చెందినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 229787కు, కొవిడ్‌ మరణాలు 1719కు చేరాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లాలో 2700 మంది యాక్టివ్‌ పాజిటివ్‌ బాధితులు ఉన్నట్టు యంత్రాంగం గుర్తించింది.

280 మందికి కరోనా.. నలుగురి మృతి

తిరుపతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల్లో 280 మందికి కరోనా సోకగా, కొవిడ్‌తో నలుగురు మృతి చెందినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 229787కు, కొవిడ్‌ మరణాలు 1719కు చేరాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లాలో 2700 మంది యాక్టివ్‌ పాజిటివ్‌ బాధితులు ఉన్నట్టు యంత్రాంగం గుర్తించింది. తాజా పాజిటివ్‌ కేసులు.. తిరుపతిలో 36, తిరుపతి రూరల్‌, రేణిగుంట మండలాల్లో 18 చొప్పున, తవణంపల్లె, పుత్తూరు మండలాల్లో 15 వంతున, శ్రీకాళహస్తిలో 12, చిత్తూరు, తొట్టంబేడు, సదుం మండలాల్లో 9 చొప్పున, కలకడలో 8, వాల్మీకిపురంలో 7, పెనుమూరులో 6, పూతలపట్టు, కార్వేటినగరం, పెద్దపంజాణి, ఏర్పేడు, బీఎన్‌ కండ్రిగ, ఐరాల, పులిచెర్ల మండలాల్లో 5 చొప్పున, గుడిపాల, యాదమరి, చంద్రగిరి, పీలేరు, పాకాల, శాంతిపురం మండలాల్లో 4 వంతున, మదనపల్లె, నిండ్ర, వెదురుకుప్పం, కేవీబీపురం, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, నిమ్మనపల్లె, పీటీఎం, రామసముద్రం మండలాల్లో 3 చొప్పున, పుంగనూరు, బంగారుపాళ్యం, శ్రీరంగరాజపురం, రామకుప్పం, నగరి, గంగవరం, గుడుపల్లె, ములకలచెరువు, వడమాలపేట మండలాల్లో 2 వంతున, కేవీపల్లె, సత్యవేడు, జీడీనెల్లూరు, ఎర్రావారిపాలెం, కుప్పం, పలమనేరు, కలికిరి, వి.కోట, నారాయణవనం, రొంపిచెర్ల, బి.కొత్తకోట, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-07-28T06:46:09+05:30 IST