10 రోజుల్లో రూ.280 కోట్లు విత్‌డ్రా

ABN , First Publish Date - 2020-04-10T20:25:51+05:30 IST

కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ విత్‌డ్రాకు కేంద్రం వెసులుబాటు కల్పించడంతో గత పది రోజుల్లో ఈపీఎఫ్ నుంచి ..

10 రోజుల్లో రూ.280 కోట్లు విత్‌డ్రా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ విత్‌డ్రాకు కేంద్రం వెసులుబాటు కల్పించడంతో గత పది రోజుల్లో ఈపీఎఫ్ నుంచి రూ.280 కోట్ల రూపాయలను ఖాతాదారులు విత్‌డ్రా చేసుకున్నారు. 1.37 లక్షల మంది ఖాతాదారులకు ప్రత్యేక విత్‌డ్రాయల్ విండో ద్వారా రూ.279.65 కోట్లు చెల్లించినట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఒక ప్రకటనలో తెలిపింది.


కేంద్ర ఆర్థిక మంత్రి మార్చి 26న ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీని వివరిస్తూ, ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన నాలుగు కోట్ల మంది వర్కర్లు తమ ప్రావిండెంట్ ఫండ్ అకౌంట్ లేదా మూడు నెలల వేతనం (ఏది తక్కువుంటే అది)లో 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించే వీలు కల్పించినట్టు ప్రకటించారు. ఆర్థిక మంతి ప్రకటన తర్వాత మార్చి 28న దీనిని ఈపీఎఫ్ఓ నోటిఫై చేసింది. పెద్ద సంఖ్యలో ఈపీఎఫ్ విత్‌డ్రాలకు డిమాండ్ ఉండే అవకాశాలున్నందున ఆన్‌లైన్ రసీదులు, క్లెయిమ్స్ సెటిట్‌మెంట్ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది.

Updated Date - 2020-04-10T20:25:51+05:30 IST