YouTube ద్వారా నెలకు ఇంత సంపాదించొచ్చా.. ఈ 27ఏళ్ల యువతి ఎన్నికోట్లు కూడబెడుతుందో చూడండి..

ABN , First Publish Date - 2022-03-11T01:49:19+05:30 IST

ఆమె సాధారణ యువతి. ప్రస్తుతం ఆమెకు 27ఏళ్లు. చదువు పూర్తైంది. కానీ ఏ ఉద్యోగమూ చేయడం లేదు. పోనీ ఏదైనా బిజినెస్ అయినా చేస్తుందా అంటే అదీ లేదు. అయినా నెలకు కోట్లాది రూపాయలను

YouTube ద్వారా నెలకు ఇంత సంపాదించొచ్చా.. ఈ 27ఏళ్ల యువతి ఎన్నికోట్లు కూడబెడుతుందో చూడండి..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె సాధారణ యువతి. ప్రస్తుతం ఆమెకు 27ఏళ్లు. చదువు పూర్తైంది. కానీ ఏ ఉద్యోగమూ చేయడం లేదు. పోనీ ఏదైనా బిజినెస్ అయినా చేస్తుందా అంటే అదీ లేదు. అయినా నెలకు కోట్లాది రూపాయలను కూడబెడుతోంది. అలాగని ఆమె తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడం లేదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? వినడానికి నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది నిజం. ఇంతకూ ఆమె అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సంపాదిస్తుందనే వివరాల్లోకి వెళితే..


కెనడాలోని ఒంటారియో‌కు చెందిన 27ఏళ్ల యువతి పేరు నవోమీ మెక్‌రే. కాలిఫోర్నియాలో ఉన్నత చదువులు చదివిన ఈమె.. తరచూ సోషల్ మీడియాను ఫాలో అయ్యేది. యూట్యూబ్‌లో ఉన్న మేకప్‌ సంబంధిత వీడియోలు చూస్తూ నిద్రపోయేది. ఈ క్రమంలోనే కొద్ది రోజులకు సరదగా.. తాను ఆహారం తినేప్పుడు ఆ దృశ్యాలను కెమెరాలో బంధించింది. ఆ తర్వాత వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. అంతే.. నెటిజన్ల నుంచి ఆ వీడియోకు భారీ మొత్తంలో స్పందన వచ్చింది. రోజుల వ్యవధిలోనే 10లక్షల మంది ఆ వీడియోను చూసేశారు. తర్వాత మూడు నెలల్లోనే ఆమె చానల్‌కు 10లక్షల మంది సబ్‌స్క్రైబ్ అయ్యారు.  



అప్పటి నుంచి ఆమె చేసిన ప్రతి వీడియో వైరల్‌గా మారడం.. లక్షలాది మంది ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వటం పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చానల్‌ను 7.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇంతకూ జనానికి అంతగా అసక్తి కలిగేలా... ఆమె ఏం తింటోంది? నెలకు ఎంత సంపాదిస్తోంది? ఈ వివరాలు చెప్పలేదు కదూ. మరేం లేదండీ.. తినగలిగే స్పాంజితో తయారు చేసిన రకరకాల ఆకారాల్లో ఉన్న పదార్థాలను తింటూ వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా నెలకు రూ.7.5కోట్లు సంపాదిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన వర్క్‌ను ఎంతో ఇష్టపడుతున్నట్టు చెప్పింది. అంతేకాకుండా యూట్యూబ్‌ ద్వారా సంపాదించిన డబ్బుతో భర్తతో కలిసి వరల్డ్ టూర్‌కు ప్లాన్ చేసినట్టు వివరించింది. 






Updated Date - 2022-03-11T01:49:19+05:30 IST