చైతన్య మహిళా సంఘం 27వ ఆవిర్భావదినం

ABN , First Publish Date - 2022-09-23T07:01:01+05:30 IST

స్వతంత్ర భారతావనిలో మహిళలపై అత్యాచారాలు పెరగడం ఒక ఎత్తయితే, వాటి నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన పాలకులు అత్యాచారాలకు...

చైతన్య మహిళా సంఘం 27వ ఆవిర్భావదినం

స్వతంత్ర భారతావనిలో మహిళలపై అత్యాచారాలు పెరగడం ఒక ఎత్తయితే, వాటి నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన పాలకులు అత్యాచారాలకు స్త్రీలనే బాధ్యులను చేస్తూ నేరస్తులకు కొమ్ముకాస్తున్నారు. గుజరాత్‌ అల్లర్ల బాధితురాలు బిల్కిస్‌ బానో అత్యాచార నిందితులను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేసి, స్వాతంత్ర్యాన్ని పరిహసించారు. రాజ్యాంగం కల్పించిన దళిత స్త్రీల, ఆదివాసీ మైనార్టీ హక్కులకు భంగం వాటిల్లితే, దాని గురించి ప్రశ్నించేవాళ్లు, న్యాయపోరాటం చేసేవాళ్లు, నిజాలు వెలికితీస్తున్న వాళ్లు నేరస్తులు, దేశద్రోహులు అవుతున్నారు. నేరస్తులు నిర్దోషులుగా బయటపడుతుంటే, బాధితుల తరఫున ఆధారాలు సేకరించి న్యాయం కోసం పోరాడేవాళ్లు నేరస్తులుగా జైలుకు పోయే విచిత్ర పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆజాదీ ఎవరిది? ఈ ఉత్సవాలు ఎవరివి అన్న ప్రశ్న వస్తుంది. ప్రశ్న నుంచి పోరాటమూ వస్తుంది. చైతన్య మహిళా సంఘం (సిఎంఎస్‌) అన్ని అసమానతలకీ, పితృస్వామ్యానికీ వ్యతిరేకంగా 1995 నుంచి పోరాటాలు చేస్తోంది. సెప్టెంబర్‌ 25న చైతన్య మహిళా సంఘం 27వ ఆవిర్భావ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో సదస్సు జరుగుతుంది. బి. జ్యోతి అధ్యక్షురాలు. డా. జి. రాధారాణి ముఖ్య అతిథి. ‘75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో మహిళల స్థితిగతులలో మార్పులు’ అంశంపై వి. సంధ్య, ‘దళిత–ఆదివాసీ–మహిళా–మైనారిటీ వ్యతిరేక తీర్పులు’ అంశంపై ప్రొ. జి. హరగోపాల్‌, ‘భారతదేశ ఉద్యమాలలో మహిళల పాత్ర’ అంశంపై రాధ ప్రసంగిస్తారు.

చైతన్య మహిళా సంఘం

Updated Date - 2022-09-23T07:01:01+05:30 IST