27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

ABN , First Publish Date - 2022-03-18T16:21:08+05:30 IST

అంతర్జాతీయ విమానసేవలను ఈ నెల 27వ తేది నుంచి ప్రారంభించనున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ సేవలు జనవరిలో ప్రారంభించాల్సి ఉండగా

27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

ఐసిఎఫ్‌(చెన్నై): అంతర్జాతీయ విమానసేవలను ఈ నెల 27వ తేది నుంచి ప్రారంభించనున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ సేవలు జనవరిలో ప్రారంభించాల్సి ఉండగా ఒమైక్రాన్‌ నేపధ్యంలో విరమించుకున్నారు. ప్రస్తుతం మూడో అల ముగిసి సహజస్థితికి చేరుకోవడంతో 27వ తేది నుంచి అంతర్జాతీయ విమానసేవలు ప్రారంభించాలని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. దీనికోసం చెన్నై విమానాశ్రయ అధికారులు సన్నాహాలు చేపట్టనున్నారు.


Updated Date - 2022-03-18T16:21:08+05:30 IST